ప్రైవేటు స్కూళ్ల ఫీజులను నియంత్రిస్తాం: కేటీఆర్ | Sakshi
Sakshi News home page

ప్రైవేటు స్కూళ్ల ఫీజులను నియంత్రిస్తాం: కేటీఆర్

Published Fri, Apr 15 2016 1:29 AM

we will control private schools fee, says ktr

ట్వీటర్‌లో మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రైవేటు స్కూళ్ల లో ఫీజులను నియంత్రించనున్నామని మంత్రి కె. తారకరామారావు అన్నారు. దీనికి సంబంధించిన నోటీసులను విద్యాశాఖ ఇప్పటికే జారీ చేసిందని వెల్లడించా రు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. మంత్రి కే టీఆర్ ట్వీట్‌పై హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్(హెచ్‌ఎస్‌పీఏ) హర్షం వ్యక్తం చేసింది. ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు కావాల్సి ఉంటుంది. ఈ కమిటీ ఏర్పాట య్యే వరకు ప్రస్తుత ఫీజులనే కొనసాగించాలని హెచ్‌ఎస్‌పీఏ అధికార ప్రతినిధి శివ మకుటం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2009 తర్వాత వచ్చిన జీవోఎంఎస్ నంబ ర్లు 91, 1, 42లకు చట్టం చేయాలన్నారు. 
 
‘హైదరాబాద్‌లో 12 స్కూళ్ల ఆర్థిక లావాదేవీలు తేల్చేందుకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు సదరు స్కూళ్లలో తనిఖీలు నిర్వహించి నివేదిక ను విద్యాశాఖకు అందజేశా రు. సమాచార హక్కు చట్టం కింద వివరాలు సమర్పించాలని కోరితే అసలు కమిటీయే ఏర్పాటు కాలేదని అధికారులు సమాధానం ఇవ్వడం విడ్డూరం. మంత్రి కేటీఆర్ స్కూల్ ఫీజులకు కళ్లెం వేసి తల్లిదండ్రులకు మేలు చేస్తారని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement