పోటెత్తారు... | Sakshi
Sakshi News home page

పోటెత్తారు...

Published Tue, Oct 14 2014 3:35 AM

Welfare schemes

  • ‘సంక్షేమ’ ధరఖాస్తుల కోసం క్యూకట్టిన జనం
  • సొవ్ముసిల్లిన వృద్దులు...వుహిళలకూ ఇబ్బందులు
  • ఫారాలు దొరక్క హైరానా
  • పచార లోపం..అంతా గందరగోళం
  • సాక్షి, సిటీబ్యూరో: సంక్షేవు పథకాలకు దరఖాస్తు చేసేందుకు జనం బారులు తీరారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని సర్కిల్, వుండల కార్యాయూలు, రేషన్ షాపులు దరఖాస్తుదారులతో కిటకిటలాడారుు. అర్హులైన లబ్థిదారులకు సంక్షేవు పథకాలు వర్తింపజేయుటానికి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రవూనికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

    ఈమేరకు నగరంలో సోవువారం నుంచి 20వ తేదీవరకు వుండల కార్యాలయూల్లో పింఛన్లు, కుల, ఆదాయు, నివాస ధృవీకరణ ప్రత్రాలు, రేషన్ షాపుల్లో ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. తెల్లకాగితంపైనే దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నప్పటికీ...నూనా దరఖాస్తు పత్రాన్ని వుండల, రేషన్ షాపుల్లో అందుబాటులో ఉంచలేదు. దీంతో కొందరు దళారులు ఒక్కో దరఖాస్తు ఫారాన్ని రూ.5-10 చొప్పున విక్రయించారు.

    ఇక దరఖాస్తు అంశంపై సరైన ప్రచారం, అవగాహన లేక ప్రజలు గందరగోళానికి గురయ్యారు. బస్తీల్లో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలతో సవూవేశాలు నిర్వహిస్తావుని ప్రకటించిన అధికార గణం వాటి జోలికే వెళ్లలేదు. దీంతో కొన్ని కేంద్రాల్లో తోపులాటలతోపాటు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
     
    సొవ్ముసిల్లిన వృద్దులు..

    దరఖాస్తుల స్వీకరణకు ఆయా కార్యాలయాల్లో పది కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ వృద్ధులు, వుహిళలకు ఇబ్బందులు తప్పలేదు. బండ్లగూడ, హిమాయత్‌నగర్, షేక్‌పేటలో వృద్ధులు క్యూలో గంటల తరబడి నిలబడి సొమ్మసిల్లారు. సరైన వసతులు లేక నేలపై, అరుగులపై కూర్చోవటం కనిపించింది. 16 వుండలాల్లో అటు ఇటు గా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. రేషన్ షాపుల్లో కూడా ఆహారభద్రత కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవటానికి జనం హైరానా పడ్డారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సంక్షేమ పథకాలకు సంబంధించి లక్షా 63 వేల 968 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.
     
    తెల్లకాగితం రాసి ఇవ్వాలి : కలెక్టర్

    దత్తాత్రేయనగర్: సంక్షేమ పథకాల దరఖాస్తులను ప్రజలు తెల్లకాగితంపై రాసి అధికారులకు అందజేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేరు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డు నెంబర్, చిరునామా, ఫోన్ నెంబర్లను దరఖాస్తులో పొందుపరచాలన్నారు.
     
    దళారులను నమ్మొద్దు: తెల్లరేషన్ కార్డుల స్థానంలో జారీ చేయనున్న ఆహార భద్రత కార్డుల కోసం మద్య దళారులను  ఆశ్రయించ వద్దని హైదరాబాద్ సీఆర్వో, డీఎస్వో రాజశేఖర్‌లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేషన్‌కార్డులు కలిగి ఉన్నవారితో పాటు కొత్త వారు సైతం తెల్లకాగితంపై వివరాలు రాసి సమీపంలోని రేషన్ షాపులో అందజే సి రశీదు తీసుకోవాలన్నారు.
     

Advertisement
Advertisement