ఈ కష్టాలు తీరేదెన్నడు? | Sakshi
Sakshi News home page

ఈ కష్టాలు తీరేదెన్నడు?

Published Tue, Nov 29 2016 2:55 AM

ఈ కష్టాలు తీరేదెన్నడు?

నోట్ల సమస్యతో రాష్ట్రవ్యాప్తంగా జనం అవస్థలు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా నోట్ల రద్దుతో జనం పడుతున్న కష్టాలే కనిపిస్తున్నాయి. శని, ఆదివారాలు వరుస సెలవులు రావడంతో సోమవారం బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీగా క్యూలైన్లు కనిపించాయి. బ్యాంకుల్లో నగదు అందుబాటులో లేక వినియోగదారులకు చెల్లించలేకపోయాయి. హైదరాబాద్ పరిధిలోని 1,435 బ్యాంకుల్లోనూ అరకొరగానే నగదు ఉపసంహరణకు అనుమతించారు. ఆర్‌బీఐ నుంచి నగదు నిల్వలు ఇంకా పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చేరనందున మరో వారం రోజులు నగదు కష్టాలు తప్పవని బ్యాంకర్లు స్పష్టం చేయడం గమనార్హం.

కరెంట్ ఖాతా కలిగిన వ్యాపారులకు సైతం రూ.ఐదు వేలతోనే సరిపెట్టారు. పింఛన్లు, శుభకార్యాలు ఉన్నవారికి నగదు అవస్థలు చుక్కలు చూపారుు. గ్రేటర్ హైదరాబాద్‌లోని మొత్తం ఏడువేల ఏటీఎంలు ఉండగా.. మూడువేలకు పైగా ఏటీఎంలు పూర్తిగా మూతపడ్డారుు. మిగతా వాటిల్లోనూ నగదు నింపిన ఒకటి రెండు గంటల్లోనే ఖాళీ అరుుపోయారుు. చాలా ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులే దర్శనమిచ్చారుు. ఇక బ్యాంకుల్లో ఇస్తున్న రూ.2 వేల నోటుకు చిల్లర కోసం జనం నానా కష్టాలు పడాల్సి వచ్చింది. పలు చోట్ల రూ.500 కొత్త నోట్లు దొరక్క జనం ఇబ్బందులు పడ్డారు. బేగం బజార్, మోండా మార్కెట్, సుల్తాన్‌బజార్, బడీచౌడీ, చార్మినార్ సహా పలు ప్రధాన మార్కెట్లలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, కొనుగోళ్లు స్తంభించిపోయారుు.

Advertisement
Advertisement