ఎన్నికలు నిర్వహించడం లేదేం..? | Sakshi
Sakshi News home page

ఎన్నికలు నిర్వహించడం లేదేం..?

Published Thu, Dec 1 2016 3:36 AM

Why not conducting elections ..?

రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఎన్నికలపై హైకోర్టు
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు అధికారుల సంఘానికి ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టు స్పందించింది. ఎన్నికలు నిర్వహించకుండా ఎందుకు తాత్కాలిక కమిటీని కొనసాగి స్తున్నారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ తదితరు లను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబర్ 14వ తేదీకి వారుుదా వేసింది. మంగళవారం ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పోలీసు అధికారుల సంఘానికి ఎన్నికలు నిర్వహించకుండా తిరిగి తాత్కాలిక కమిటీని నియమిస్తూ నవంబర్ 22న డీజీపీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అదిలాబాద్‌కు చెందిన జి.శ్రీనివాసరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం జస్టిస్ చల్లా కోదండరామ్ విచారణ జరిపారు.

ఎన్నికలు నిర్వహించా లని కోరుతూ డీజీపీకి వినతి పత్రం సమర్పించామని పిటిషనర్ తరఫు న్యాయ వాది సంకు తెలిపారు. దీనిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని గతంలో హైకోర్టుకు నివేదించారని, అరుుతే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విన్నవించారు. పెపైచ్చు సంఘానికి ఎన్నికలు నిర్వహించకుండా మళ్లీ తాత్కాలిక కమిటీనే ఏర్పాటు చేశారని కోర్టుకు తెలిపారు. నాలుగేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా తాత్కాలిక కమిటీలతో కాలయాపన చేస్తున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 14వ తేదీకి వారుుదా వేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement