రూ.2681 కోట్లతో ‘స్మార్ట్’ | Sakshi
Sakshi News home page

రూ.2681 కోట్లతో ‘స్మార్ట్’

Published Fri, Apr 8 2016 2:28 AM

With Rs .2681 crore, 'smart'

సాంస్కృతిక రాజధానిగా ఓరుగల్లు
పర్యాటకులను ఆకర్షించేలా పనులు
పట్టణంలో పచ్చదనానికి ప్రాధాన్యం
మారనున్న నగరం రూపురేఖలు
స్మార్ట్‌సిటీ డీపీఆర్ లక్ష్యాలు ఇవే..

 

వరంగల్ నగరాన్ని రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్మార్ట్‌సిటీ సమగ్ర ప్రణాళిక రూపొందించారు. నగరానికి ఉన్న చారిత్రక ప్రాశస్త్యాన్ని ఉపయోగించుకుని పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కేలా పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా భద్రకాళి, పద్మాక్షి ఆలయాల కేంద్రంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధమైంది. దీంతో పాటు నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అదేవిధంగా బస్‌స్టేషన్, డ్రెరుునేజీల నిర్మాణం, సోలార్ విద్యుత్ దీపాలు, వర్షపు నీరు ఒడిసి పట్టడం వంటి పనులు ఉన్నాయి. ఈ పనులకు రూ.2681 కోట్లతో సిద్ధం చేసిన స్మార్ట్‌సిటీ ప్రతిపాదనల్లో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి..

 

హన్మకొండ: నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్మార్ట్‌సిటీ పథకం తొలి దశ అమలులో వరంగల్ నగరానికి అవకాశం త్రుటిలో చేజారిపోయింది. మలిదశ  అమలులో చోటు దక్కించుకునేందుకు లీ కంపెనీ నేతృత్వంలో సమగ్ర నివేదికను రూపొందించారు. మొత్తం రూ.2,681 కోట్ల వ్యయంతో నగరం రూపురేఖలు మార్చే విధంగా పనులు చేపట్టాలని ఈ ప్రణాళికలో పేర్కొన్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్ భాగస్వామ్యంలో ఏర్పాటయ్యే స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ద్వారా రూ.1686 కోట్ల నిధులు సమీకరించాలని సూచించారు. మిగిలిన రూ.995 కోట్లను పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా  సేకరించాలని డీపీఆర్‌లో పేర్కొన్నారు. ఇలా సేకరించిన నిధులతో ఐదేళ్ల పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు.


ముఖ్యవిభాగాలు
స్మార్ట్‌సిటీ ద్వారా చేపట్టబోయే పనులను ప్రాంతాల వారీగా వర్గీకరించారు. ఇందులో రెట్రోఫిట్టింగ్ పేరుతో భద్రకాళీ చెరువు చుట్టూ 500 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తారు. రీడెవలప్‌మెంట్ స్కీం కింద 50 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి, ఆ ప్రాంతాన్ని అన్ని రకలా అధునాతన సదుపాయాలు ఉండేలా అభివృద్ధి పరుస్తారు. దీని తర్వాత 250 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి దీన్ని గ్రీన్‌ఫీల్డ్ సిటీగా రూపాంతరం చెందేలా పనులు చేపడుతారు. వీటితో పాటు నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేలా మరికొన్ని కార్యక్రమాలు చేపడుతారు. ఈ విభాగంలో ఈ గవర్నెన్స్ సిటిజన్ సర్వీసెస్, వేస్ట్ మేనేజ్‌మెంట్, వాటర్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ మేనే జ్‌మెంట్, అర్బన్ మొబిలిటీ వంటి పనులు నిర్వహిస్తారు.

Advertisement
Advertisement