మహిళకు కరోనా పాజిటివ్‌

4 Jun, 2020 13:49 IST|Sakshi
ఆలేరు: బాధిత బంధువులను ఆస్పత్రికి తరలిస్తున్న అధికారులు

ఆలేరు రూరల్‌:  మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు బుధవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మండల వైద్యాధికారిణి జ్యోతిబాయి తెలిపిన వివరాల ప్రకారం..  38సంవత్సరాల వయస్సు గల వివాహిత  కొంత కాలంగా గుండె జబ్బుతో బాధ పడుతోంది. చికిత్స నిమిత్తం మే 28న సికింద్రాబాదులోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరింది.  రెండు రోజుల వ్యవధిలో జ్వరం, శ్వాస సంబంధిత లక్షణాలు కనిపించడంతో అనుమానం కలిగిన ఆస్పత్రి వైద్యులు జూన్‌2న కరోనా పరీక్షలు చేయగా  పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కొల్లూరులో అధికారుల పర్యటన
కోవిడ్‌ వ్యాధికి బారిన పడిన మహిళ స్వగ్రామమైన కొల్లూరు గ్రామంలో వైద్య,పోలీసు,రెవె న్యూ శాఖల అధికారులు బుధవారం పర్యటించారు. వైద్యాధికారిణి జ్యోతిబాయి, తహసీల్దా ర్‌ శ్యాంసుందర్‌రెడ్డి, ఎస్‌ఐ రమేశ్‌ గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమిక కాంటాక్టులను గుర్తించారు. బాధితురాలి కు టుంబ సభ్యుల దగ్గరి బంధువులను కరోనా ప రీక్షల నిమిత్తం బీబీనగర్‌లోని ఏయిమ్స్‌కు తరలించారు. కోవిడ్‌ బాధిత మహిళ ఈ నెల 27న మండల పరిధిలోని సాయిగూడెంలో జరిగిన బంధువు వివాహ వేడుకకు హాజరైనట్లు అధికా రుల క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. 

కరోనా పరీక్షలకు ఏడుగురి తరలింపు
మునుగోడు: కరోనాతో మృతిచెందిన ఓ వృద్ధ మహిళని కలిసిన ఏడుగురికి కరోనా పరీక్షలు జ రిపేందుకు బుధవారం వైద్యులు నల్లగొండకు తరలించారు. గత  29వ తేదీన సింగారం గ్రా మానికి చెందిన ఓ వృద్ధ మహిళ హైదరబాద్‌లో ని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఇంట్లో  ఇంట్లో అద్దెకు ఉన్న నలుగురితో పాటు ఆటో డ్రైవర్, ఆర్‌ఎంపీ, మెడికల్‌ దుకాణ య జమానిని హోంక్వారంటైన్‌లో ఉంచారు. బుధవారం అధికారులు వారిని నల్లగొండకు తరలించారు. కాగా, ఆర్‌ఎంపీ, మెడికల్‌ దుకాణం యజ మానితో పాటు మిగత ఐదుగురి శాంపిల్స్‌ సేకరించారు. అనంతరం ఆర్‌ఎంపీ, మెడికల్‌ దుకాణం యజమాని తమకు ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. వీరందరి ఫలితాలు గురువారం రానున్నట్లు అధికారులు తెలిపారు.  

ఏడు నెలల బాబుకు కరోనా ..
నల్లగొండ టౌన్‌: జిల్లా కేంద్రంలో ఏడు నెలల బాబుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.  జిల్లా కేంద్రంలోని పానగల్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో నివాసం ఉండే వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. వారి కుటుంబంలోని ఆరుగురు సభ్యులను ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి  నమూనాలు సేకరించారు. వాటిని  కరోనా పరీక్షలకు పంపించడంతో వారిలో ఆయన ఏడు నెలల కుమారుడికి కరోనా పాజిటివ్‌గా రిపోర్టులో వచ్చినట్లు జిల్లా సర్వేలెన్స్‌ అధికారి డాక్టర్‌ రాహుల్‌ బుధవారం తెలిపారు. అయితే బాబు తల్లికి రిపోర్టులో నెగెటివ్‌ వచ్చినందున తిరిగి ఆమె నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపిస్తున్నామని తెలిపారు. తల్లితో పాటు బాబును చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు