గోదారి తీరాన పుష్కర శోభ | Sakshi
Sakshi News home page

గోదారి తీరాన పుష్కర శోభ

Published Sat, Jul 11 2015 3:01 AM

గోదారి తీరాన పుష్కర శోభ - Sakshi

సమీపిస్తున్న ఘడియలు
- ఘాట్‌ల నిర్మాణం పూర్తి
- తాత్కాలిక నల్లాలు ఏర్పాటు
భద్రాచలం :
గోదావరి పుష్కర ఘడియలు సమీపిస్తున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించటంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది.  భద్రాచలం గోదావరి తీరంలో పుష్కర ఘాట్‌ల నిర్మాణం ఇప్పటికే పూర్తి అయింది. మెట్లను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రస్తుతం రంగులు వేసే పనులు జరుగుతున్నాయి. పుష్కర ఘాట్‌లో మట్టి పేరుకుపోవటం తో వాటిని ప్రత్యేక మిషన్‌ల ద్వారా తొలగిస్తున్నారు. మట్టిని తొలగించిన తరువాత బుదర అంటకుండా ఇసుకతో నింపేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

తాగునీటి ఇబ్బందులు లేకుండా కరకట్టకు ఆనుకొని ఉన్న రహదారిలో తాత్కాలిక నల్లాలను ఏర్పాటు చేశారు. వాటికి నిరంతరాయంగా నీటిని సరఫరా చేసేందుకు ప్రజారోగ్యశాఖాధికారులు మరమ్మతులు వేగవంతం చేశారు. కల్యాణమండపం పరిసర ప్రాంతాల్లో భక్తులు సేద దీరేందుకు తాత్కాలిక వసతి కేంద్రాలను నిర్మిస్తున్నారు. దీంతో భద్రాచలంనకు పుష్కర శోభ సంతరించుకుంది. భద్రాచలంనకు సుమారుగా 4 లక్షల వరకూ భక్తులు పుష్కర స్నానం కోసమని వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రామాలయంను దర్శించుకునేభక్తులకు స్వామి వారి ప్రసాదాలను అందించేందుకు 20 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు.

Advertisement
Advertisement