ఐటీ హబ్‌లో అలజడికి యజ్దానీ కుట్ర | Sakshi
Sakshi News home page

ఐటీ హబ్‌లో అలజడికి యజ్దానీ కుట్ర

Published Mon, Feb 6 2017 1:50 AM

ఐటీ హబ్‌లో అలజడికి యజ్దానీ కుట్ర - Sakshi

ఎన్‌ఐఏ విచారణలో వెల్లడి  
సాక్షి, హైదరాబాద్‌: ఐసిస్‌లో చేరి విధ్వంసాల్లో పాలుపంచుకోవాలని భావించిన నగర వాసి ఇబ్రహీం యజ్దానీ విచారణలో సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. దాడులకు ఏ విధంగా తెగబడాలి? ఎలా మారణకాండ సృష్టించాలో యజ్దానీ ఇంటర్నెట్‌ వేదికగా తర్ఫీదు పొందాడని ఎన్‌ఐఏ అధికారులు విచారణలో తేల్చారు. ఐఎస్‌లో చేరేందుకు యత్నించిన యజ్దానీని గతంలో రాష్ట్ర నిఘా వర్గాలు గుర్తించి ఎన్‌ఐఏకు అప్పగించారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన యజ్దానీ నాలుగేళ్లపాటు సౌదీ అరేబియాలో పనిచేశాడు.

అక్కడే ఐఎస్‌ రిక్రూటర్‌ అమీర్‌తో పరిచయమైంది. మరికొంత మందిని ఐఎస్‌లో చేర్పించేందుకు హైదరాబాద్‌ వచ్చిన యజ్దానీ గ్యాంగ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. వీసా ప్రయత్నాలు విఫలమవడంతో దేశం లోనే ఐటీ హబ్‌గా పేరుగాంచిన హైదరాబాద్‌ నుంచే ఐఎస్‌ విధ్వం సకాండను ప్రారంభించాలని కుట్ర పన్నినట్టు ఎన్‌ఐఏ విచారణలో బయటపెట్టింది. 17 నెలలపాటు ఐఎస్‌లోని కీలక వ్యక్తులతో  gulf&up.com ద్వారా సంభాషణలు సాగించినట్టు అధికారులు గుర్తించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement