ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందని ఇంటికి నిప్పు | Sakshi
Sakshi News home page

ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందని ఇంటికి నిప్పు

Published Sun, Apr 5 2015 11:21 PM

youngster set fire to house due to property crises

హైదరాబాద్: ఆస్తి పంపకాల్లో తనకు అన్యాయం జరిగిందని ఆగ్రహించిన ఓ యువకుడు ఇంట్లోని వస్తువులకు నిప్పుపెట్టాడు. ఈ ఘటన ఆదివారం రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాలివీ.. యాకుత్‌పురా తలాసాబ్‌కీ గల్లీ ప్రాంతానికి చెందిన జమాల్ షరీఫ్ (75)కు ముగ్గురు కుమారులు ఉస్మాన్, రియాజ్, తహేర్ ఉన్నారు. కాగా, కొన్ని నెలల క్రితం తన ఆస్తిని ముగ్గురు కుమారులకు సమానంగా పంచి పెట్టాడు. రెండో కుమారుడు రియాజ్ కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు.

 

అయితే, ఆస్తి పంపకాల్లో తనకు అన్యాయం జరిగిందంటూ ఆటో డ్రై వర్ తహేర్ నిత్యం తల్లితో గొడవ పడేవాడు. ఈక్రమంలోనే ఆదివారం సాయంత్రం పెట్రోల్ బాటిల్‌తో వచ్చిన తహేర్ ఇంట్లో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. దీంతో ఫ్రీజ్, టీవీ, బీరువా తదితర వస్తువులతో పాటు ’ 10 వేల నగదు కాలిపోయాయి. స్థానికులు మంటలను ఆర్పివేశారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement