త్వరలో తెలంగాణలో పర్యటిస్తా: వైఎస్ జగన్‌

10 Aug, 2017 02:47 IST|Sakshi
కార్యకర్తలను పలకరిస్తున్న వైఎస్ జగన్‌
  • నంద్యాల వెళ్తున్న జగన్‌కు ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
  • పెబ్బేరు: నంద్యాల ఉప ఎన్నికలు ముగిశాక త్వరలోనే తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా పెబ్బేరు 44వ జాతీయ రహదారి బైపాస్‌ రోడ్డు మీదుగా నంద్యాలలో ఉప ఎన్నికల ప్రచారానికి బుధవారం వెళ్తున్న జగన్‌కు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

    వనపర్తి, పెబ్బేరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడు మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి జగన్‌కు పూలమాల వేయగా.. తిరిగి అదే పూలమాలను అతడికే వేసి ‘విష్ణూ బాగున్నావా!’అని ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎండీ షఫీ, చంద్రశేఖర్‌ యాదవ్, కన్వీనర్‌ దేవాచారి, చంద్రశేఖర్, బాలరాజు, చలం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు