ప్రజల గుండెల్లో వైఎస్ పదిలం | Sakshi
Sakshi News home page

ప్రజల గుండెల్లో వైఎస్ పదిలం

Published Fri, Jan 29 2016 12:28 AM

ప్రజల గుండెల్లో వైఎస్ పదిలం - Sakshi

బూర్గంపాడు:తెలంగాణ ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి పదిలంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సారపాక ప్రధానకూడలిలో వైఎస్ విగ్రహాన్ని గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..  వైఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాలపై అన్ని సామాజిక వర్గాల వారు పూర్తి సంతృప్తితో ఉన్నారని, ఆయనపై వారికి ఇప్పటికీ అభిమానం ఉందని అన్నారు. ‘‘ప్రతి పల్లెలో దేవుడి గుడి ఉందో లేదోగానీ, మహా నేత వైఎస్ విగ్రహం మాత్రం ఉంది’’ అని అన్నారు. వైఎస్‌ను ప్రతి ఒక్కరూ ఒక దేవుడిగా భావిస్తున్నారని అన్నారు.
 
 దళితులకు, గిరిజనులకు, విద్యార్థులకు, కార్మికులకు, కర్షకులకు వైఎస్ హయాంలో జరిగిన మేలు ఆ తరువాత జరగలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న కాలంలో వైఎస్సార్ సీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వైఎస్ ఆశయ సాధనకు వైఎస్సార్ సీపీ కృత నిశ్చయంతో పని చేస్తున్నదని అన్నారు. పాండురంగాపురం రైల్వేస్టేషన్ నుంచి సారపాక వరకు రైల్వే లైన్‌ను విస్తరణ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానన్నారు. సారపాక రైల్వే లైన్‌ను సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ బలోపేతానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విశేషంగా కృషి చేస్తున్నారని ప్రత్యేక అభినందనలు తెలిపారు.
 
 వైఎస్ హయాంలోనే ఏజెన్సీ అభివృద్ధి : ఎమ్మెల్యే పాయం
 వైఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏజెన్సీ అభివృద్ధి వేగవంతమైందని పినపాక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గిరిజనుల పోడు భూములకు పట్టాలిచ్చి, హక్కులు కల్పిం చిన ఘనత వైఎస్‌దేనని అన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన రెండుసార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి సాగు నీటి ప్రాజెక్టులు మంజూరు చేశారని అన్నారు. ముత్యాలమ్మపేటలోని వైఎస్ విగ్రహాన్ని కూడా ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే పాయం ఆవిష్కరించారు.
 
 ఈ కార్యక్రమంలో ఎంపీపీ కైపు రోశిరెడ్డి,  సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటి సభ్యుడు బిజ్జం శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ వీరంరెడ్డి శ్రీని వాసరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు కైపు సుబ్బరామిరెడ్డి, భూపెల్లి నర్సింహారావు, మారం శ్రీనివాసరెడ్డి,  రాష్ట్ర నాయకులు ఉడుముల లక్ష్మీరెడ్డి, గంగిరెడ్డి శ్రీని వాసరెడ్డి, ఊసా అనిల్‌కుమార్, గంగిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు జక్కం సర్వేశ్వరరావు, పాటి భిక్షప తి, అంగోతు సునీత, చింతా కోటేశ్వరి, తుమ్మల పున్న మ్మ, అజ్మీరా వసంత, మండల నాయకులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, భజన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement