నిధులపై రగడ | Sakshi
Sakshi News home page

నిధులపై రగడ

Published Fri, Apr 3 2015 4:01 AM

Zilla Parishad General Meeting Public issues

నల్లగొండ :  జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అనుకున్నదే జరిగింది. జెడ్పీ పాలకవర్గం కొలువుదీరిన తొమ్మిది నెలల కాలంలో రెండు సార్లు జరిగిన సర్వసభ్య సమావేశాల్లో ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాలపై సమీక్షించే అవకాశం లేకుండా పోయిందని కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు మాటల యుద్ధానికి దిగారు. జెడ్పీ నిధుల వినియోగం, ప్రభుత్వ పథకాల అమలు పై పూ ర్తి స్థాయి సమీక్ష చేయాలని పట్టుబట్టారు. గురువారం నల్లగొండలోని ఉదియాదిత్య భవన్‌లో జరిగిన జెడ్పీ 3 వ సర్వసభ్య సమావేశానికి చైర్మన్ నేనావత్ బాలూనాయక్ అధ్యక్షత వహించారు.
 
 ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీ చైర్మన్ బొందుగుల నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మార్తి గురువుల మృతికి సంతాపంగా సభ నివాళులు అర్పించింది. గురువులు సంతాప సభ నడిగూడెంలో ఉన్నందున సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. అయితే అత్యవసరంగా ఆమోదించాల్సిన తీర్మానాలకు సభ్యులు ఆమోదం తెలపాలని చైర్మన్ కోరారు. అందుకు కాంగ్రెస్ సభ్యులు అంగీకరించక పోగా.. చైర్మన్ ప్రవేశపెట్టిన తీర్మానాలను వ్యతిరేకించారు. సంతాపం సభ అని చెప్పి ఈ సమావేశంలోనూ ప్రజా సమస్యలు, పథకాల పై ఎలాంటి సమీక్ష లేకుండానే తీర్మానాలు ఆమోదించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
 
 జిల్లా పరిషత్‌కు వస్తున్న నిధులు, వాటి వినియోగం తదితర అంశాల పై సమగ్రంగా చర్చిచేందుకు జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని వరుసగా రెండు రోజుల పాటు నిర్వహించాలని సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులకు మద్దతుగా వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి గొంతు కలిపారు. ఎలాంటి భేషేజాలకు పోకుండా రెండు రోజులు పాటు సమావేశాలు నిర్వహిస్తే ప్రజా సమస్యలు చర్చించేందుకు వీలుంటుందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని పై స్పందించిన చైర్మన్.. జెడ్పీ నిధులు దాచుకుని.. రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. సభ్యుల కోరిక మేరకు ఈ నెల 12 తేదీలోపు రెండు రోజుల పాటు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ రోజున అందరు సభ్యులు, అధికారులు తప్పకుండా హాజరుకావాలన్నారు.
 
 13 వ ఆర్థిక సంఘం నిధులపైనే రచ్చ
 చైర్మన్ ప్రవేశపెట్టిన తీర్మానాల్లో 13 వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించినవి ఉన్నాయి. ప్రధానంగా హైదరాబార్ మెట్రో వాటర్ వర్క్స్ బోర్డుకు చెల్లించాల్సిన విద్యుత్ బకాయి రూ.40 కోట్లు ప్రభుత్వమే చెల్లించాలని చైర్మన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులు ఆమోదించారు. కానీ 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ, మరమ్మతులకు 13 వ ఆర్థిక సంఘం నుంచి రూ.53 కోట్లు  కేటాయించేందుకు ప్రవేశపెట్టిన తీ ర్మానాన్ని సభ్యులు వ్యతిరేకించారు. దీంట్లో విద్యుత్ బకాయిలు, కార్మికుల వేతనాలు ఉన్నా యి. మూడు మాసాలుగా కార్మికులకు వేతనాలు చెల్లించలేదని, వారికి జీతాలు చెల్లించకుం టే విధులు బహిష్కరించే అవకాశం ఉందని చైర్మన్ వివరించారు. దీనికి సభ్యులు మాట్లాడుతూ కార్మికుల వేతనాలు చెల్లించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ 13 వ ఆర్థిక సంఘం నిధులపై సమగ్రంగా చర్చించిన తర్వాతే చెల్లించాలన్నారు.
 
 ఈ 9 నెలల కాలంలో సభ్యులకు ఎలాంటి నిధులు రాలేదని.. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. బీఆర్‌జీఎఫ్ నిధులు కూడా రాకుండా పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆర్థిక సంఘం నిధుల గురించి పూర్తిగా చర్చించిన తర్వాతే నిధుల మళ్లింపు చేయా లన్నారు. రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని సభ్యులు కోరారు. ఈ సమావేశాల్లోనే మిగిలిన తీర్మానాల పై కూడా చర్చించాలన్నారు. సభ్యులు కోరికను చైర్మన్ కూడా అంగీకరించడంతో సభను వాయిదా వేశా రు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రావుల మహేందర్ రెడ్డి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, ఇతర సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
 ప్రముఖుల సంతాపం...
 జెడ్పీ మాజీ చైర్మన్ బొందుగుల నర్సింహారెడ్డి,జెడ్పీటీసీ  మాజీ సభ్యుడు మార్తి గురువుల మృతికి చైర్మన్ నేనావత్ బాలునాయక్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్, విప్ గొంగడి సునీత, ఎంపీ గుత్తా ్డ, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ లు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, జెడ్పీటీసీల ఫోరం జి ల్లా అధ్యక్షుడు మందడి రామకృష్ణా రెడ్డి, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పాశం రామిరె డ్డి తమ సంతాపం తెలిపారు.
 
 ఆమోదించిన ... వ్యతిరేకించిన తీర్మానాలు
 నడిగూడెం మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నికలో మార్తి గురువులు కుటుంబానికి అవకాశం ఇవ్వడంతో పాటు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. ఈ తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదించి ంది. టీడీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి.
 
 13 వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, జెడ్పీ, మండల పరిషత్ వార్షిక బడ్జెట్, ఉపాధి హామీ వార్షిక బడ్జెట్, తాగు నీటి సమస్య తీర్చేందుకు విడుదలైన నిధులు ఏ విధంగా ఖర్చు చేయాలనే దాని పై చైర్మన్ తీర్మానాలు ప్రవేశపెట్టారు. కానీ వీటి పై పూర్తిస్థాయి చర్చ చేయకుండా ఆమోదించడాన్ని కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకించడంతో వాయిదా వేశారు.
 

Advertisement
Advertisement