వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

జోన్లపై వెనక్కి తగ్గిన తెలంగాణ

Published Sat, Oct 7 2017 4:29 PM

 zonals in telangana may increase, new committee formed - Sakshi

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం జోనల్‌ వ్యవస్థ రద్దు విషయంలో వెనక్కి తగ్గింది. జోనల్‌ వ్యవస్థ రద్దుతో తీవ్ర ఇబ్బంది తలెత్తుతుందని భావించిన తెలంగాణ ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకుంది. అలాగే, జోన్ల సంఖ్యను పెంచాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం, మంత్రులు ఎమ్మెల్యేలతోపాటు ప్రభుత్వ సీనియర్‌ అధికారులతో ప్రత్యేక కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. జోనళ్ల సంఖ్యను ఎన్ని పెంచాలని, పెంచే జోన్లలో ఏయే జిల్లాలను చేర్చాలనే విషయాలను ఆ కమిటీ నిర్ణయిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ .. 'ఉమ్మడి ఏపీలో ఉద్యోగ నియామకాల కోసం జోనల్‌ వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్వర్వులు (371డీ)ని సవరించాల్సి ఉంది.

కొత్తగా ఏర్పడిని తెలంగాణకు కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులను ఇవ్వాలన్న ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతాం. జోనల్‌ వ్యవస్థ ఉండాలా? రద్దు చేయాలా అనే దానిపై అధ్యయనం చేస్తాం. డీఎస్సీని కొత్త జిల్లాల ప్రాతిపదికన వేయాలా ? పాత జిల్లాల ప్రాతిపదికన వేయాలా అనే దానిపై చర్చ జరిగింది. కొత్త జోన్ల ఏర్పాటు అనివార్యం' అని కేసీఆర్‌ అన్నారు. ఇక కొత్త జోన్ల ఏర్పాటు కమిటీలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్‌ రావు, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌, మంత్రి పోచారం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, సీనియర్‌ అధికారులు ఎస్‌కే జోషి, సురేశ్‌ చంద్ర, అజయ్‌ మిశ్రా, బీఆర్‌ మీనా, రాజీవ్‌ రంజన్‌ ఆచార్య, ఆధార్‌ సిన్హా, డీజీపీ అనురాగ్‌ శర్మ ఉండనున్నారు. వీరు త్వరలోనే ముసాయిదా సిద్ధం చేయనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement