Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రం
21 రోజుల నిరీక్షణ.. ఉత్కంఠకు నేడే తెర

సాక్షి, అమరావతి: ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వైఎస్సార్‌సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి. గత నెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్‌ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్‌ ముగియడంతో ఫలితాల కోసం జూన్‌ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్‌ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్‌లలోని స్లిప్‌లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది.తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురంరాష్ట్రంలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇందులో ఈవీఎంల ద్వారా 3.33 కోట్ల మంది, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 5.15 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, వృద్ధులు అ్యధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా రికార్డు స్థాయలో 81.8 శాతం ఓటింగ్‌ నమోదైంది. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది, 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపు కోసం 33 చోట్ల 401 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ తర్వాత కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చేటు చేసుకోవడంతో, ఓట్ల లెక్కింపు సందర్భంగా అటువంటి సంఘటలను పునరావృతం కాకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు 111 అసెంబ్లీ స్థానాల్లో 5 – 6 గంటల్లోనే పూర్తి కానుంది. 61 నియోజకవర్గాల్లో 6 – 8 గంటలు, మూడు నియోజకవర్గాల్లో 9 – 10 గంటల సమయం పట్టనుంది. పార్లమెంటు ఫలితాలకు సంబంధించి 13 రౌండ్లు ఉన్న రాజమండ్రి, నరసాపురం ఫలితాలు తొలుత వెల్లడి కానుండగా, 27 రౌండ్ల లెక్కింపు ఉన్న అమలాపురం ఫలితం ఆలస్యంగా రానుంది. అసెంబ్లీ విషయానికి వస్తే కేవలం అయిదు గంటలలోపే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నరసాపురం ఫలితాలు.. ఆలస్యంగా భీమిలి, పాణ్యం ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఒంటరిగా సిద్ధంవైఎస్సార్‌సీపీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో జట్టు కట్టి కూటమిగా పోటీలో నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధం పేరుతో ముందస్తుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోగా, తెలుగుదేశం పార్టీ సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికపై సిగపట్లు పడుతూ ప్రచారంలో వెనుకబడ్డారు. టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో, భారతీయ జనతాపార్టీ ఆరు పార్లమెంటు, 10 అసెంబ్లీ.. జనసేన రెండు పార్లమెంటు, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాల్లో సామాన్యులను అభ్యర్థులుగా నిలబెట్టగా, తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకొని తమ పార్టీకి చెందిన అభ్యర్థులను బీజేపీ, జనసేనల్లోకి పంపి అభ్యర్థులుగా నిలబెట్టింది.ఫలితాలు ఇలా తెలుసుకోవచ్చు..ఎన్నికల సరళిని, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. లెక్కింపులో ఒక రౌండు పూర్తి కాగానే ఆ ఫలితాలను కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద మైక్‌లో వెల్లడించడంతో పాటు, మీడియా ప్రతినిధులకు కనపడే విధంగా డిస్‌ప్లే బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. ప్రతి రౌండు ఫలితాలను సువిధా యాప్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. నియోజకవర్గ ఫలితాలతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఫలితాలను తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను, యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. https://results.­eci.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీంతోపాటు ‘ఓటర్స్‌ హెల్ప్‌¬లైన్‌’ అనే యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా ఎన్నికల ఫలితాల సరళిని తెలుసుకోవచ్చు. 25,209 మంది సిబ్బంది : ముఖేష్‌ కుమార్‌ మీనారాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 2,387 మంది, 25 పార్లమెంటు స్థానాల్లో 454 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కోసం 25,209 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించడానికి 119 మంది కేంద్ర అబ్జర్వర్లు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారన్నారు. పార్లమెంటు స్థానాలకు తొలుత 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రారంభించి, 8.30 తర్వాత ఈవీంఎల లెక్కింపును కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో డిక్లరేషన్‌ ఫారంపై రిటర్నింగ్‌ అధికారి నియమించిన అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం ఉంటే సరిపోతుందని, దీనిపై ఇక ఎటువంటి అభ్యంతరాలను అనుమతించమని స్పష్టం చేశారు. ఈసారి అత్యధిక సంఖ్యలో పోస్టల్‌ బ్యాలెట్లు నమోదు కావడంతో 25 చోట్ల నాలుగు రౌండ్లు కూడా లెక్కింపు జరగనుందన్నారు. ప్రతి 500 ఓట్లు ఒక రౌండ్‌గా లెక్కిస్తామని, ఇది సుదీర్ఘ పక్రియ కావడంతో ఒకొక్క రౌండ్‌ పూర్తి కావడానికి కనీసం రెండున్నర గంటల సమయం పడుతుందని చెప్పారు. అదే ఈవీఎంల లెక్కింపులో ప్రతి రౌండు సగటున 25 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో పూర్తవుతుందన్నారు. లెక్కింపు ప్రారంభమైన అయిదు గంటల్లోనే మెజార్టీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడవుతాయని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 45,000 పోలీసు సిబ్బందితో పాటు 67 కంపెనీల సాయుధ బలగాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద డ్రోన్‌ కెమెరాలతో కూడా నిఘా పెట్టామని, లోపల ఈవీఎంల తరలింపు నుంచి ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తామన్నారు. ఏజెంట్లు తమ అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని, దురుసుగా వ్యవహరిస్తే ఎన్నికల నిబంధన 54 కింద కౌంటింగ్‌ హాల్‌ నుంచి బయటకు పంపిస్తామని స్పష్టం చేశారు. రీ కౌంటింగ్‌ కోరితే దానికి గల స్పష్టమైన కారణాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలన్నారు. ఆ కారణాలతో ఆర్వో ఏకిభవిస్తేనే రీ కౌంటింగ్‌కు అనుమతిస్తారని చెప్పారు. కౌంటింగ్‌ హాళ్లలోకి మొబైల్‌ ఫోన్లను అనుమతించరని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ తర్వాత అభ్యర్థి గెలిచినట్లు ఫారం 20 ఇవ్వడానికి కనీసం గంట– గంటన్నర పడుతుందని, అప్పటి వరకు అభ్యర్థి వేచి ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మద్యం అమ్మకాలపై నిషేధం విధించామని తెలిపారు.

CM YS Jagan Tweet On Counting Of AP Elections
పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్‌ సందేశం

తాడేపల్లి: ఏపీలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు(మంగళవారం) జరుగనున్న కౌంటింగ్‌ ప్రక్రియలో భాగంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సందేశాన్ని పంపారు. ఈ మేరకు‘ఎక్స్‌’ వేదికగా సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.‘ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024

Telangana political parties are nervous about counting of Lok Sabha votes
లోక్‌సభ ఓట్ల లెక్కింపుపై ‘డబుల్‌’ ఉత్కంఠ

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌ జరిగిన 22 రోజుల తర్వాత జరుగుతున్న ఓట్ల లెక్కింపు కో సం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు ఎదురుచూస్తున్నాయి. పోలింగ్‌ సరళి, ఎగ్జిట్‌ పోల్స్‌ను బ ట్టి.. రాష్ట్రంలో పోటీ రెండు జాతీయ పార్టీల మధ్యే జరిగిందన్న అంచనాలు వెలువడ్డాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా మెజార్టీ సీట్లు త మకంటే తమకేనని.. డబుల్‌ డిజిట్‌ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కచ్చితంగా పది స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్‌.. పది కంటే ఎక్కువే గెలుస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎన్ని స్థానాల్లో గెలుస్తామన్న దానిపై క చ్చితమైన లెక్కలు చెప్పకపోయినా.. కనీస స్థానా ల్లో విజయం దక్కుతుందని ఆశిస్తోంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందన్న దానిపైనా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. 12 సీట్లు కూడా రావొచ్చంటున్న కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు వస్తాయనే అంచనాలో ఉంది. కనీసం తొమ్మిది, పది స్థానాల్లో గెలుస్తామన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పోలింగ్‌ సరళిని బట్టి చూస్తే మరో రెండు, మూడు సీట్లు కూడా గెలుస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌తోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పూర్తి పట్టు సాధించిన వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు నల్లేరు మీద నడకేనని అంటున్నారు. సికింద్రాబాద్, ఆదిలాబాద్‌ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని లెక్కలు వేస్తున్నారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరి, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైనా.. విజయ తీరం చేరుతామనే అంచనాలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ బలహీనపడటం, బీజేపీకి సంస్థాగత బలం లేకపోవడం, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్నికలు రావడంతో పెద్దగా ప్రజా వ్యతిరేకత లేకపోవడం, గ్రామీణ స్థాయిలో పార్టీకి ఉన్న పట్టు వంటివి అనుకూలిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ మేజిక్‌తో బీజేపీదే హవా అంటున్న కమలనాథులు మోదీ మేజిక్‌తో తెలంగాణలోనూ బీజేపీ హవా కొనసాగుతుందని ఆ పార్టీ ముఖ్య నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లు గెలిచి సత్తా చాటుతామని అంటున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌లో వెలువడిన అంచనాలను మించి సీట్లు సాధిస్తామని చెబుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన నాలుగు ఎంపీ సీట్లకు అదనంగా మరో ఆరేడు సీట్లు గెలుస్తామని అంటున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలే ప్రభావం చూపాయని కమలనాథులు చెబుతున్నారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందనే అంచనాలు తమకు ఉపకరించాయని.. ఈ ఎఫెక్ట్‌తో పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని అంచనా వేస్తున్నారు. ఎగ్జాక్ట్‌ పోల్స్‌ తమకే అనుకూలమంటూ బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌తో సంబంధం లేకుండా ఎగ్జాక్ట్‌ పోల్స్‌ ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్‌ఎస్‌ అంటోంది. బీఆర్‌ఎస్‌ ఒకట్రెండు స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నా.. బీఆర్‌ఎస్‌ మాత్రం అంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో బీఆర్‌ఎస్‌ ఆధిక్యత కనబర్చిందని.. అదే తరహాలో ఇప్పుడు ఫలితాలు ఉంటాయని అంచనా వేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఇప్పుడు కాంగ్రెస్‌ అనుకూల ఓటింగ్‌ జరగలేదని.. అదే సమయంలో బీజేపీ భారీగా ఏమీ పుంజుకోలేదని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌తో పోలిస్తే కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకే ఎక్కువగా గండి పడిందని పేర్కొంటున్నారు. అంతేగాకుండా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ 17 రోజుల పాటు చేసిన బస్సుయాత్ర కూడా ప్రభావం చూపిందని.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటేసినవారిలో కొంత మేర తిరిగి అనుకూలంగా మారారని చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీతో జరిగిన ముక్కోణపు పోటీ బీఆర్‌ఎస్‌కు అక్కడక్కడా అనుకూలిస్తుందనే అంచనా వేస్తున్నారు.ఢిల్లీ పీఠం ఎవరిదో..?లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయి ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈసారి కూడా మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొనడం ఓవైపు.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫెయిలవుతాయని, ఇండియా కూటమి గెలుస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన కామెంట్స్‌ మరోవైపు ఉత్కంఠ రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా మోదీ ప్రభావం ఎలా ఉంటుంది?ఇండియా కూటమికి ఉన్న సానుకూలతలేంటి? ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపైనా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఎడతెగని చర్చ నడుస్తోంది.ఆ స్థానాలపై మరింత ఆసక్తితెలంగాణలోని నాలుగైదు నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌ తరఫున ఎంపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన దానం నాగేందర్‌ తలపడుతున్న సికింద్రాబాద్‌ ఫలితంపై అందరి ఫోకస్‌ ఉంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరి.. ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి అయ్యే చాన్స్‌ ఉందంటున్న బండి సంజయ్‌ బరిలో ఉన్న కరీంనగర్‌.. బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన నేతలు పోటీ చేస్తున్న జహీరాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్‌ తదితర స్థానాల్లో ఫలితాలపైనా ఆసక్తి ఉంది.

Lok Sabha Results 2024: Narendra Modi eyes third term, INDIA hopes for 2004 repeat
LS Results: మోదీ 3.0? ఇండియా కూటమి?

న్యూఢిల్లీ: దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణాలు రానేవచ్చాయి. 80 రోజులకు పైగా ఏడు విడతల్లో సాగిన సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల క్రతువు తుది దశకు చేరింది. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్‌ కొట్టి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా నెహ్రూ రికార్డును సమం చేస్తారా? లేదంటే కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి అనూహ్యమేమైనా చేసి చూపించనుందా? సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించనుంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏకగ్రీవమైన సూరత్‌ మినహా 542 లోక్‌సభ స్థానాలు, ఏపీలో 175, ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాల్లో విజేతలెవరో తేలనుంది. కౌంటింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. మధ్యాహా్ననికల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఎన్డీఏ హ్యాట్రిక్‌ ఖాయమని శనివారం వెలువడ్డ ఎగ్జిట్‌ పోల్స్‌ ముక్త కంఠంతో పేర్కొనడం, విపక్ష కూటమి వాటిని తిరస్కరించడం తెలిసిందే. ఎన్నడూ లేని స్థాయిలో ఈ దఫా పోలింగ్‌ అనంతరం కూడా కేంద్ర ఎన్నికల సంఘంపై, ఈవీఎంలపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ను ‘మోదీ మీడియా పోల్‌’గా అభివరి్ణంచాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ముసుగులో అసలు ఫలితాలు ఎలా ఉండాలో అధికార యంత్రాంగానికి మోదీ స్పష్టమైన సంకేతాలిస్తున్నారంటూ దుయ్యబట్టాయి. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తిని, దేశ ఎన్నికల ప్రక్రియను న్యూనత పరిచేందుకు విపక్షాలు మతిలేని ప్రయత్నాలు చేస్తున్నాయంటూ అధికార బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగియాన్న ఆరోపణలకు ఆధారాలుంటే ఇవ్వాలంటూ విపక్షాలను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ నిలదీశారు! దాంతో పోలింగ్‌ ప్రక్రియ జూన్‌ 1నే ముగిసినా రాజకీయ వేడి మాత్రం అలాగే కొనసాగింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ కౌంటింగ్‌పైనే కేంద్రీకృతమయ్యాయి... హోరాహోరీ పోరు... ఈసారి ఎన్నికలు అత్యంత హోరాహోరీగా సాగాయి. ప్రచారం ముందెన్నడూ లేనివిధంగా ప్రధానంగా మతం, కులాల ప్రాతిపదికగా సాగింది. వరుసగా మూడో విజయం కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి సర్వశక్తులూ ఒడ్డగా, పదేళ్ల మోదీ పాలనకు తెర దించడమే లక్ష్యంగా విపక్షాలు కాంగ్రెస్‌ సారథ్యంలో ఇండియా కూటమిగా బరిలో దిగాయి. బీజేపీ తరఫున మోదీ అన్నీ తానై ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ వస్తే సంపద పన్ను తదితరాల పేరిట జనం ఆస్తులు లాక్కుంటుందని ప్రతి ఎన్నికల సభలోనూ ఆరోపణలు గుప్పించారు. చివరికి హిందూ స్త్రీల మెళ్లో పుస్తెలనూ లాక్కుంటారన్నారు. విపక్షాలు కూడా గట్టిగానే ఎదురు దాడికి దిగాయి. ముస్లింలకు మతాధారిత రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీ ప్రకటనను అందిపుచ్చుకున్నాయి. రిజర్వేషన్లను మొత్తానికే ఎత్తేస్తారని, రాజ్యాంగాన్నే సమూలంగా మార్చేస్తారని ఊరూవాడా హోరెత్తించాయి. దాంతో ప్రచార పర్వం ఆసాంతం అక్షరాలా కురుక్షేత్రాన్ని తలపించింది. ఎన్డీఏకు 400 పై చిలుకు, బీజేపీకి సొంతగానే 370 స్థానాలొస్తాయని మోదీ, ఆ పార్టీ నేతలు పేర్కొనగా; ఇండియా కూటమికి 295 స్థానాలు ఖాయమని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీ చెప్పుకొచ్చారు. లోక్‌సభలో మెజారిటీకి 272 సీట్లు అవసరం.ఆ సీట్లపై ఆసక్తి... ఈసారి పలు లోక్‌సభ స్థానాల్లో ఫలితాలపై ఎనలేని ఆసక్తి నెలకొంది. వాటిలో టాప్‌లో ఉన్నది రాహుల్‌గాంధీ పోటీ చేసిన రాయ్‌బరేలీ అంటే అతిశయోక్తి కాదు. యూపీలో గాం«దీల కంచుకోట అమేథీలో 2019లో ఆయన తొలిసారి ఓటమి చవిచూడటం తెలిసిందే. ఈసారి మరో కంచుకోట రాయ్‌బరేలీలో నెగ్గుతారా లేదా అన్నది ఆసక్తికరం. సిట్టింగ్‌ స్థానమైన కేరళలోని వయనాడ్‌లో కూడా సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా నుంచి రాహుల్‌ గట్టి పోటీ ఎదుర్కొన్నారు. అక్కడి ఫలితంపైనా ఉత్కంఠే నెలకొంది. మాజీ సీఎంలు భూపేశ్‌ భగెల్, చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ, ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ కూతుళ్లు మీసా భారతి, రోహిణీ ఆచార్య, శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సులే గెలుస్తారో లేదో చూడాలి.

Mexico Election Results 2024: Claudia Sheinbaum elected Mexico first female president
మెక్సికోలో కొత్త చరిత్ర

మెక్సికో సిటీ: మెక్సికో చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే అధికార మోరెనా వామపక్ష కూటమి అభ్యర్థి క్లాడియా షేన్‌బామ్‌ (61) ఘనవిజయం సాధించారు. 200 ఏళ్ల స్వతంత్ర మెక్సికో చరిత్రలో దేశ అధ్యక్ష పీఠమెక్కనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. యూదు మూలాలున్న తొలి ప్రెసిడెంట్‌ కూడా ఆమే కానున్నారు! షేన్‌బామ్‌కు ఇప్పటికే దాదాపు 60 శాతం ఓట్లు లభించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రత్యర్థులిద్దరూ నాకిప్పటికే ఫోన్‌ చేసి అభినందించారు. ఓటమిని అంగీకరించారు. దేశానికి తొలి అధ్యక్షురాలిని కాబోతున్నా’’ అంటూ చిరునవ్వులు చిందించారు. ‘‘ఇది నేను ఒంటరిగా సాధించిన విజయం కాదు. తల్లులు మొదలుకుని కూతుళ్లు, మనవరాళ్ల దాకా దేశ మహిళలందరి విజయమిది’’ అన్నారు. విపక్ష కూటమి మహిళకే అవకాశమిచి్చంది. రెండు ప్రధాన పారీ్టల నుంచీ మహిళలే తలపడటమూ మెక్సికో చరిత్రలో ఇదే తొలిసారి. విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్‌ గాల్వెజ్‌కు 28 శాతం, మరో ప్రత్యర్థి జార్జ్‌ అల్వారిజ్‌ మైనేజ్‌కు 10 శాతం ఓట్లు వచి్చనట్టు ఈసీ పేర్కొంది. షేన్‌బామ్‌ నూతన చరిత్ర లిఖిస్తున్నారంటూ అధ్యక్షుడు ఆంద్రెజ్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ అబ్రేడర్‌ అభినందించారు. ఆరేళ్ల పదవీకాలంలో ఆయన పలు చరిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు. షేన్‌బామ్‌ విజయంలో లోపెజ్‌ పాపులారిటీదే ప్రధాన పాత్ర. ఒకసారికి మించి అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు మెక్సికో రాజ్యాంగం అనుమతించదు. దాంతో ఆయన రెండోసారి బరిలో దిగలేకపోయారు. 2018లో లోపెజ్‌ గెలిచినప్పటి మాదిరిగా ఈసారి ప్రజల్లో పెద్దగా హర్షాతిరేకాలు వ్యక్తం కాకపోవడం విశేషం. అధ్యక్ష పదవితో పాటు పాటు 9 రాష్ట్రాల గవర్నర్లు, 128 మంది సెనేటర్లు, 500 మంది కాంగ్రెస్‌ ప్రతినిధులు, వేలాది మేయర్లు, స్థానిక సంస్థల ప్రతినిధి పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మొత్తం 32 గవర్నర్‌ పదవుల్లో మెరేనా పార్టీకి 23 ఉన్నాయి. షేన్‌బామ్‌కు సవాళ్లెన్నో... షేన్‌బామ్‌ అక్టోబర్‌ 1న అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమెకు సవాళ్ల స్వాగతమే లభించనుంది. మహిళలపై హింసకు మెక్సికో ప్రపంచంలోనే పెట్టింది పేరు. ఈ సమస్యను రూపుమాపాల్సి ఉంది. సంక్షేమ పథకాలతో లోపెజ్‌ బాగా ఆకట్టుకున్నా అడ్డూ అదుపూ లేదని వ్యవస్థీకృత హింస, గ్యాంగ్‌ వార్లు, డ్రగ్‌ ట్రాఫికింగ్, పెట్రో ధరల పెరుగుదల తదితరాల కట్టడికి పెద్దగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. వీటిపై కొత్త అధ్యక్షురాలు దృష్టి పెట్టాలని వారు భావిస్తున్నారు. ప్రస్తుత పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే దేశాన్ని పీడిస్తున్న అన్ని సమస్యలనూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని షేన్‌బామ్‌ ప్రకటించారు. ఏ తారతమ్యాలూ లేకుండా ప్రజలందరినీ ఒకేలా చూస్తానన్నారు.లా డాక్టోరా... షేన్‌బామ్‌ విద్యార్హతలు అన్నీ ఇన్నీ కావు. ఎనర్జీ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేవారు. అందుకే ఆమెను అభిమానులు ముద్దుగా ‘లా డాక్టోరా’ అని పిలుచుకుంటారు. పర్యావరణవేత్తగా చాలా పేరుంది. నోబెల్‌ శాంతి బహుమతి పొందిన ఐరాస పర్యావరణ శాస్త్రవేత్తల బృందంలో షేన్‌బామ్‌ సభ్యురాలు. రాజధాని మెక్సికో సిటీ మేయర్‌గా చేసిన తొలి మహిళ కూడా ఆమే. షేన్‌బామ్‌ తాత, అమ్మమ్మ హిట్లర్‌ హోలోకాస్ట్‌ హింసాకాండను తప్పించుకోవడానికి యూరప్‌ నుంచి మెక్సికో వలస వచ్చారు. షేన్‌బామ్‌ మెక్సికో సిటీలోనే పుట్టారు. 2000లో రాజకీయ అరంగేట్రం చేశారు.

Chandrababu Spreading Fake Propaganda On Jagan Reddy Stone Pelting
దాడి మీ కళ్లకు కనిపించలేదా?

సాక్షి, అమరావతి : ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌పైకి జనం మధ్య నుంచి రాయి విసరడం.. అది సీఎం కనుబొమ్మపై తగలడం.. కుట్లు పడటం.. కళ్లెదుటే కనిపిస్తున్నా, చంద్రబాబు, గురివింద రామోజీ మాత్రం తప్పును ఒప్పు చేయాలని పడరాని పాట్లు పడుతున్నారు. నిస్సిగ్గుగా దోషులను వెనకేసుకొస్తున్నారు. తప్పును తప్పు అని చెప్పే ధైర్యం లేక దుష్ప్రచారానికి మరోమారు తెర లేపారు. 2018లో పాదయాత్ర సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగినప్పుడు, ఇటీవల ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న ఘటన విషయంలో చంద్రబాబు, రామోజీలు వక్రీకరణే లక్ష్యంగా బరితెగించారు.సీఎం జగన్‌పైకి రాయి విసిరిన కేసులో నిందితుడు వేముల సతీశ్‌ బెయిల్‌పై విడుదలైన తర్వాత చంద్రబాబు పలుకులు వల్లించి తాను టీడీపీ గూటి చిలుకనని చెప్పకనే చెప్పాడు. ఆ కట్టుకథను పచ్చ మీడియా ప్రముఖంగా ప్రచురించడం ద్వారా ఈ కుట్ర అంతా తమ పర్యవేక్షణలో సాగుతోందని రామోజీరావు స్పష్టం చేశారు. సీఎం జగన్‌ను హత్య చేసేందుకు పక్కా పన్నాగంతో పదునైనా రాయితో దాడికి పాల్పడ్డారని పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిరూపించారు.వైద్య నిపుణులు కూడా శాస్త్రీయంగా విశ్లేషించారు. కానీ పోలీసులు తనకు తుపాకీ గురిపెట్టి మరీ అభియోగాలను ఒప్పుకోవాలని బెదిరించారని సతీశ్‌ చెప్పడం పచ్చ నాటకంలో ఓ భాగం. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో, పోలీసులు ఈసీ పరిధిలో ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది. అయినా పచ్చ మీడియా ఈ కేసును పక్కదారి పట్టించేందుకు ఇంతగా యత్నిస్తోందంటే.. ఈ హత్యాయత్నం వెనుక కుట్రదారుల పాత్ర­ను మరుగున పరిచేందుకేనని స్పష్టమవుతోంది. పన్నాగం ప్రకారమే హత్యాయత్నంసీఎం జగన్‌ను హత్య చేయాలన్న కుట్రదారుల పన్నాగాన్ని వేముల సతీష్‌ అమలు చేశాడు. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 13న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ‘మేమంతా సిద్ధం’ యాత్ర విజయవాడలోని అజిత్‌ సింగ్‌ నగర్‌లోకి ప్రవేశించక ముందే సతీష్‌ అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న బ్రిడ్జ్‌ వద్ద పదునైన సిమెంట్‌ కాంక్రీట్‌ రాయిని ఎంపిక చేసుకుని తన ప్యాంట్‌ జేబులో వేసుకుని మరీ వివేకానంద స్కూల్‌ వద్దకు వచ్చాడు. మరి కొంతమందితో కలసి అక్కడ మాటు వేశాడు. ఆ రోజు రాత్రి 8.04 గంటలకు సీఎం జగన్‌ తన వాహనంపై నిలబడి యాత్ర నిర్వహిస్తూ అక్కడికి చేరుకున్నారు.ఆ వెంటనే సతీష్‌ ఆ రాయిని బలంగా సీఎం వైఎస్‌ జగన్‌పైకి గురిచూసి విసిరారు. సీఎం తలలో సున్నిత భాగంపై దాడి చేయడం ద్వారా ఆయన్ను హత్య చేయాలన్న కుట్రదారుల పన్నాగాన్ని అమలు చేసేందుకే సతీష్‌ ఆ దాడికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తు ఆ రాయి సీఎం జగన్‌ తలపై సున్నిత భాగంలో కాకుండా ఎడమ కన్ను పైభాగంలో తగలడంతో ప్రాణాపాయం తప్పింది. సాంకేతిక ఆధారాలతో నిర్ధారణముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు­లో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు, సీఎం బస్సు చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డ్‌ అయిన దృశ్యాలు, స్థానికులు తమ సెల్‌ ఫోన్లో తీసిన వీడియోలు, కాల్‌ డేటా తదితర ఆధారాలను విశ్లేషించారు. ఆ ఆధారాలన్నీ హత్యా­యత్నం కుట్రలో ఏ1 వేముల సతీష్, ఏ 2ల పాత్ర­ను నిర్ధారించాయి.అనంతరం పోలీసులు ఏప్రిల్‌ 17 సాయంత్రం 5 గంటలకు ప్రధాన నిందితుడు వేముల సతీష్‌ను విజయవాడ రాజరాజేశ్వరి­పేటలోని కేజీఎఫ్‌ అపార్ట్‌మెంట్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న అనంతరం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్‌ చేశారు. నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సతీష్‌ ఇంట్లో సోదాలు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన రోజు అతడు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. కణతపై తగిలి ఉంటే ప్రాణాపాయమే..పదునైన కాంక్రీట్‌ రాయితో సీఎం జగన్‌ కణతపై దాడి చేయాలన్నదే నిందితుడు సతీశ్‌ లక్ష్యమన్నది స్పష్టమైంది. పదునైన రాయి కణతపై తగిలినా తల వెనుక భాగంలో తగిలినా ప్రాణాపాయం సంభవించేదని వైద్య నిపుణులు తేల్చి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ – న్యూరో సైన్స్‌ (నిమ్‌హాన్స్‌– బెంగళూరు)లో న్యూరాలజీ విభాగా­ధి­పతిగా డాక్టర్‌ కేవీఆర్‌ శాస్త్రితోపాటు పలువురు ప్రముఖ వైద్య నిపుణులు ఆ విషయంలో ఏకాభి­ప్రాయం వ్యక్తం చేశారు.కణత భాగంలో ఎముక సున్నితంగా ఉంటుంది. పదునైన రాయి బలంగా తగిలితే ఆ ఎముక విరిగి లోపలే ఉండిపోయేది. ఆ ఎముక లోపల మెదడు భాగానికి గుచ్చుకుంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. ఎడమ కణత భాగంలోనే పెద్ద రక్తనాళం ఉంటుంది. అది తెగి భారీగా రక్తస్రావం అయ్యేది. తద్వారా కుడి చేయి చచ్చుబడటం, మాట పడిపోయే ప్రమాదానికి దారి తీసేది. మెదడులోనే రక్తస్రావమైనా, మెదడుకు రక్త సరఫరాలో ఇబ్బంది కలిగినా, ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ కుడివైపు ఉన్న ప్రజలను చూసి అభివాదం చేస్తూ ఉండటంతో ఎడమ వైపు నుంచి బలమైన రాయితో దాడి చేశారు. ఆ కాంక్రీట్‌ రాయి తల వెనుక కింద భాగంలో తగిలి ఉంటే మెదడుకు తీవ్ర గాయమయ్యేది. మెదడులో రక్తస్రావం అయి ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. అదృష్టవశాత్తు అది ఎడమ కనుబొమ్మపై భాగంలో తగలడంతో తీవ్ర గాయంతో సరిపోయింది. కుట్రదారుల పాత్ర కప్పిపుచ్చేందుకే..సీఎం జగన్‌పై హత్యయత్నం కేసులో తెరవెనుక కుట్రదారుల పాత్రపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో చంద్రబాబు, ఈనాడు రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే గుర్తించిన ఏ 2తోపాటు తెర వెనుక ఉన్న ప్రధాన కుట్రదారుల పాత్రను నిగ్గు తేల్చాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానానికి నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అందుకోసం మరి కొందరు సాక్షులను విచారించడంతోపాటు సాంకేతికపరమైన డేటాను మరింత విశ్లేషించాల్సి ఉందన్నారు. కీలక వ్యక్తుల సహకారం లేకుండా ఈ కుట్రను ఇంత పకడ్బందీగా అమలు చేయడం సాధ్యం కాదని పోలీసులు చెబుతున్నారు.దాంతో ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రానున్నట్లు స్పష్టమవడంతో చంద్రబాబు హడలిపోతున్నారు. అందుకే పోలీసులపైనే తిరిగి అసత్య ఆరోపణలు చేసే కుట్రకు తెరతీశారు. తద్వారా పోలీసులు ఆత్మరక్షణలో పడి ఈ కేసులో కుట్రదారుల పాత్రపై దర్యాప్తు చేయకుండా మిన్నుకుండిపోయేలా చేయాలన్నది వారిద్దరి లక్ష్యం. అందుకే పోలీసులు తన తలకు తుపాకి గురిపెట్టి అభియోగాలను ఒప్పుకోవాలని బెదిరించారని, లేకపోతే తన తల్లిదండ్రులను కూడా చంపేస్తామని బెదిరించారని నిందితుడు వేముల సతీశ్‌తో చెప్పించారు.తాము చెప్పినట్టు చెబితే రూ.2 లక్షలు ఇస్తామని పోలీసులు చెప్పారన్నాడు. సతీష్‌.. తాము చెప్పినట్టు చెప్పడంతో రామోజీరావు తన పత్రికలో ఆ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించారు. అసలు ప్రధాన నిందితుడు తాను హత్యాయత్నం చేశానని ఎప్పుడైనా అంగీకరిస్తాడా..!? ఏదో అబద్ధం చెప్పి దర్యాప్తును పక్కదారి పట్టించాలనే యత్నిస్తాడు. మరి ఆ మాత్రం తెలియకుండా ఈనాడు రామోజీరావు సతీశ్‌ చెప్పిన కట్టుకథను అంత ప్రముఖంగా ప్రచురించడం విడ్డూరం. తద్వారా ఆ కట్టుకథ వెనుక తామే ఉన్నామని చెప్పకనే చెబుతోంది.న్యాయస్థానంలో ఆ రోజు ఎందుకు చెప్పలేదు?చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు నిందితుడు సతీశ్‌ న్యాయమూర్తి వద్ద ఆ విషయాలు ఎందుకు చెప్పలేదని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా పోలీసులు ఆ విధంగా బెదిరించి ఉంటే న్యాయమూర్తి ఎదుటే చెప్పేందుకు నిందితుడికి అవకాశం ఉంది. కానీ ఆ రోజు చెప్పనే లేదు. బెయిల్‌పై విడుదలయ్యాక బయటకు వచ్చి టీడీపీ అనుకూల మీడియా ముందే ఆ ఆరోపణలు చేయడం గమనార్హం. అంటే పోలీసులు నిందితుడు సతీశ్‌ను ఆ విధంగా బెదిరించలేదన్నది సుస్పష్టం. అదంతా టీడీపీ పన్నాగమేనన్నది తేటతెల్లమవుతోంది.ఈసీ ఆధ్వర్యంలోనే పోలీసుల దర్యాప్తుటీడీపీ, ఈనాడు రామోజీరావు ఉద్దేశపూర్వకంగా విస్మరించిన మరో అంశం... సీఎం జగన్‌పై హత్యా­యత్నం కేసును పోలీసులు ఈసీ పర్యవేక్షణలో నిర్వహించారు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించగానే రాష్ట్రంలో పోలీసులతో పాటు మొత్తం అధికార వ్యవస్థ అంతా ఈసీ ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఎన్నికల నియమావళి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు ఎప్పటికప్పుడు ఈసీకి నివేదిస్తున్నారు. ఈసీ వ్యక్తం చేస్తున్న సందేహాలను పోలీసులు నివృత్తి చేస్తూ మరీ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు సతీశ్‌ ద్వారా పోలీసులపై టీడీపీ ఆరోపణలు చేయించడం అంటే ఈసీనే నిలదీస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. నిందితుడు సతీశ్‌ ఈసీనే నిందించాలిగానీ పోలీసులను కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.2018లోనూ ఇదే దుష్ప్రచార కుట్రపాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై 2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం కేసును కూడా టీడీపీ, పచ్చ మీడియా ఇదే రీతిలో వక్రీకరించేందుకు యత్నించడం గమనార్హం. టీడీపీ నేత హర్షవర్ధన్‌ చౌదరికి చెందిన ఫ్యూజన్‌ రెసారెంట్‌లో పనిచేసే జనుపల్లి శ్రీనివాస్‌ అరచేతిలో పట్టేంత పదునైన కత్తితో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేంద్ర ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉండే విమానాశ్రయంలోకి శ్రీనివాస్‌ను ప్రవేశపెట్టడం వెనుక అప్పటి టీడీపీ ప్రభుత్వం పక్కా కుట్ర ఉందన్నది స్పష్టమైంది. అప్పట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజే ఉన్నారు.దాంతో ఈ హత్యాయత్నం వెనుక తమ కుట్ర ఎక్కడ బయటపడుతుందోనని భావించిన టీడీపీ వెంటనే ఆ ఉదంతాన్ని వక్రీకరించేందుకు యత్నించింది. పోలీసులు కనీసం కేసు నమోదు చేయకపోతే వైఎస్‌ జగన్‌కు సానుభూతి తీసుకురావడం కోసమే ఆయన అభిమాని అయిన జనుపల్లి శ్రీనివాస్‌ ఈ దాడికి పాల్పడ్డారని చెప్పడం గమనార్హం. చంద్రబాబు ఆదేశాలతో అప్పటి డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ హడావుడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, అదే అసంబద్ధ వాదనను వినిపించడం విభ్రాంతికరం. కానీ టీడీపీ దుష్ప్రచారం బెడిసికొట్టింది. వైఎస్‌ జగన్‌ను హత్య చేసేందుకే ఆ దాడికి పాల్పడ్డారన్నది తేటతెల్లమైంది. అయినా సరే చంద్రబాబు, రామోజీ తీరు మార్చుకోలేదు. నాడు, నేడు కూడా వక్రీకరణలు, కుట్రలే వారి రాజకీయంగా స్పష్టమవుతోంది.

Sajjala Ramakrishna Reddy About YSRCP Victory
సంబరాలకు సిద్ధంకండి: సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎన్నికల సంఘం మంగళవారం ఓట్ల లెక్కింపు చేపడుతుందని.. వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని, ఉ.10.30 గంటల నుంచి సంబరాలకు సిద్ధంకావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సజ్జల మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.ఇండియా టుడే–మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ బోగస్‌ అంటూ కొట్టిపారేశారు. ఆ సంస్థ జనసేన, బీజేపీకి ఎగ్జిట్‌ పోల్స్‌లో ఇచ్చిన స్థానాలు, ఓట్ల శాతమే అందుకు నిదర్శనమన్నారు. ఆ ఎగ్జిట్‌ పోల్స్‌లో 21 స్థానాల్లో పోటీచేసిన జనసేనకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారని.. ఈ లెక్కన ఒక్కో శాసనసభ స్థానంలో జనసేన అభ్యర్థికి 61 శాతం ఓట్లు రావాల్సి ఉంటుందని.. ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ వ్యూహంలో భాగంగా దక్షిణాదిలో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్లు చూపించే ప్రయత్నంలో ఇది భాగమని చెప్పారు. బీజేపీ కూటమిలో టీడీపీ భాగస్వామి కాకపోయి ఉంటే.. ఇండియా టుడే–యాక్సిస్‌ మై ఇండియా ఈ రీతిలో ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించేదే కాదన్నారు.స్కిల్‌ స్కాంలో చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలో అసలు చర్చే జరగలేదని.. దానివల్ల టీడీపీకి ప్రజల్లో సానుభూతి వచ్చిందని ఆ సంస్థ పేర్కొనడం విడ్డూరమన్నారు. టైమ్స్‌ నౌ, దైనిక్‌ భాస్కర్‌ సహా రాష్ట్రంలోని పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తున్నట్లు తేల్చాయని సజ్జల గుర్తుచేశారు. ఆ సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌లో పేర్కొన్న స్థానాల కంటే వైఎస్సార్‌సీపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టంచేశారు.ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వైఎస్సార్‌సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల పిలుపునిచ్చారు. సంయమనంతో వ్యవహరిస్తూ.. వైఎస్సార్‌సీపీ అభ్యరి్థకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా అభ్యర్థి ఖాతాలో పడేలా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. కౌంటింగ్‌ పూర్తయి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్‌ తీసుకునే వరకు కౌంటింగ్‌ కేంద్రం నుంచి కదలవద్దని సజ్జల కోరారు. టీడీపీ విజ్ఞప్తి మేరకే ఆ సడలింపులుఇక పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో ఎన్నికల సంఘం సడలింపులను సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రానా వాళ్లు చేసింది తప్పు తప్పు కాకుండా పోదన్నారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ నిబంధనలను సడలించడంలో ఆంతర్యమేమిటని.. పోస్టల్‌ బ్యాలెట్ల అంశంలో దేశవ్యాప్తంగా ఒక రూలూ.. రాష్ట్రంలో మరో రూలా? ఇదెక్కడి న్యాయ­మంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు పోస్టల్‌ బ్యాలెట్‌ నిబంధనలను సడలించడం విడ్డూరంగా.. అనుమానాస్పదంగా ఉందని.. అందుకే ఆ అంశంపై న్యాయపోరాటం చేశామని సజ్జల చెప్పారు.తన శక్తి ఇంత ఉందని ఒక రౌడీ ఎలాగైతే రౌడీయిజం చేసి అందరినీ భయపెడతాడో చంద్రబాబూ కూడా బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని అధికారులను బదిలీలు చేయిస్తూ యంత్రాంగంపై పట్టు సాధించే ప్రయ­త్నం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు భయ­పడి కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించేందుకు అవకాశముందని.. అందుకే ఓట్ల లెక్కింపులో ఏజెంట్లను అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు.తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని.. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తున్నామని సజ్జల గుర్తుచేశారు. గత ఎన్నికల సమ­యంలో అధికారంలో ఉన్న బాబు.. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి సీఈఓను బెదిరించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కళ్లెదుట ఘోరపరాజయం కన్పిస్తుండటంవల్లే ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని.. ఓటమికి మానసికంగా సిద్ధమవుతున్నారంటూ ఎద్దేవా చేశారు.కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి⇒ ఉదయం 6కల్లా లెక్కింపు కేంద్రం దగ్గర ఉండాలి ⇒ కౌంటింగ్‌ ఏజెంట్లకు సజ్జల దిశానిర్దేశం ‘ఈ ఎన్నికల్లో మనం పక్కాగా గెలుస్తున్నాం.. అయినా కౌంటింగ్‌లో మన పార్టీ తరఫున ఏజెంట్లుగా ఉంటున్న మీరు అప్రమత్తంగా ఉండాలి’.. అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్‌సీపీ మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయబోతోందని.. వైఎస్‌ జగన్‌ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని ఆయన చెప్పారు.ఏజెంట్లు ఉ.6 గంటలకల్లా కౌంటింగ్‌ హాల్‌ దగ్గర కచ్చితంగా ఉండాలని.. హాల్‌లో కౌంటింగ్‌ ప్రారంభం సమయం నుంచి ముగింపు దశ వరకు చాలా చురుగ్గా ఉండాలన్నారు. అదే సమయంలో సంయమనం పాటిస్తూ ఈవీఎం, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఖచ్చితంగా కౌంట్‌ అయ్యేలా చూస్తూ, లెక్కింపు న్యాయబద్ధంగా సజావుగా సాగేలా ప్రయత్నం చేయాలన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పారీ్టకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా పాజిటివ్‌గా పార్టీ అకౌంట్‌లో పడేవిధంగా జాగ్రత్త వహించాలని.. కౌంటింగ్‌ పూర్తయి డిక్లరేషన్‌ తీసుకునే వరకు కూడా అక్కడ నుంచి ఎవరూ కదలొద్దన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కౌంటింగ్‌ ఏజెంట్లతో జూమ్‌ ద్వారా సజ్జల సమావేశం నిర్వహించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విశ్రాంత ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, లీగల్‌ సెల్‌ ప్రతినిధులు మలసాని మనోహర్‌రెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

Bangalore Rave Party Case: Actress Hema Has Been Retained By Bengaluru CCB Police
బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్

సాక్షి, బెంగళూరు: బెంగళూరు డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమ సీసీబీ పోలీసులు ఎదుట సోమవారం హాజరైంది. గత నెల 20న బెంగళూరు శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే! మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో టాలీవుడ్‌ నటి హేమ కూడా ఉంది. బుకాయించినా దొరికిపోయిందిఅయితే మొదట ఆ రేవ్‌ పార్టీకి, తనకు సంబంధం లేదని బుకాయించింది. కానీ తనకు జరిపిన రక్త పరీక్షల్లో ఆమె డ్రగ్స్‌ తీసుకుందని రుజువైంది. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలంటూ హేమకు పోలీసులు రెండుసార్లు నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులు పంపగా ఎట్టకేలకు విచారణకు హాజరైంది. ఈ క్రమంలోనే ఈమెని అరెస్ట్ చేశారు. మంగళవారం కోర్టులో హాజరు పరచనున్నారు.మాదకద్రవ్యాల విక్రయంకాగా బెంగళూరు నగరశివారులోని హెబ్బగోడిలో మే 19 రాత్రి నుంచి మే 20 తెల్లవారు జాము వరకు రేవ్‌ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు పేరు చెప్పి 'సన్‌సెట్‌ టు సన్‌రైజ్‌ విక్టరీ' పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్‌ ఇతర మాదకద్రవ్యాలు విక్రయించారు. పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్‌, మహ్మద్‌ సిద్ధిఖి, వాసు, అరుణ్‌కుమార్‌, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.చదవండి: ఉపాసన ఇంటికి చేరిన బుజ్జి.. క్లీంకార కోసం స్పెషల్‌ గిఫ్ట్‌

Lok Sabha Election Result 2024: Sensex, Nifty at all-time highs
ఎగ్జిట్‌ పోల్‌ జోష్‌.. కుమ్మేసిన బుల్స్‌

ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు కానుందని వెలువడిన ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలతో మార్కెట్‌ కొత్త శిఖరాలకు పరుగులు తీసింది. ఎన్‌డీఏ భారీ మెజారిటీని సాధించనుందన్న అంచనా కొనుగోళ్ల జోరుకు దారిచూపింది. ఒక్కసారిగా ఊపందుకున్న పెట్టుబడులతో స్టాక్‌ బుల్‌ లాభాలతో కుమ్మేసింది. దీంతో సెన్సెక్స్‌ 2,507 పాయింట్ల(3.5 శాతం) పోల్‌వాల్ట్‌ చేసింది. 76,469 వద్ద ముగిసింది. నిఫ్టీ 733 పాయింట్లు(3.3 శాతం) ఎగసి 23,264 వద్ద స్థిరపడింది, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాలతో ముగిశాయి. గతంలో 2021 ఫిబ్రవరి 1న బడ్జెట్‌ రోజున సెన్సెక్స్, నిఫ్టీ 5 శాతం చొప్పున జంప్‌ చేశాయి. అంతక్రితం అంటే 2019 మే 20న సైతం ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్‌డీఏ కూటమి రెండోసారి విజయాన్ని అంచనా వేయడంతో మార్కెట్లు 3 శాతానికిపైగా పురోగమించాయి. ఇంట్రాడేలోనూ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డు గరిష్టాలకు చేరాయి.సంపదే సంపదమార్కెట్లు కదం తొక్కడంతో ఒకే ఒక్క రోజులో స్టాక్‌ ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ. 13.78 లక్షల కోట్లు పెరిగింది. ఫలితంగా బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ. 426 లక్షల కోట్లకు చేరింది. వెరసి సరికొత్త రికార్డ్‌ 5.13 ట్రిలియన్‌ డాలర్లను తాకింది. ఈ బాటలో ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ సైతం 5.09 లక్షల కోట్ల డాలర్ల(రూ. 422.48 లక్షల కోట్లు)కు చేరింది. స్పష్టమైన మెజారిటీతో వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకానుండటంతోపాటు.. గతేడాది(2023–24) దేశ జీడీపీ ప్రపంచ దేశాలలోనే అత్యధికంగా 8.2 శాతం వృద్ధిని సాధించడం ఇన్వెస్టర్లకు ఎనలేని ప్రోత్సాహాన్నిచ్చినట్లు విశ్లేషణ.రిలయన్స్‌ భళా..సెన్సెక్స్‌ 30 షేర్లలో 25 కౌంటర్లు భారీ లాభాలతో నిలవగా.. కేవలం సన్‌ ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, ఏషియన్‌ పెయింట్స్, నెస్లే, ఇన్ఫోసిస్‌ నామమాత్రంగా డీలా పడ్డాయి. వీటితోపాటు ఇక నిఫ్టీ 50లో ఐషర్, ఎల్‌టీఐఎం, బ్రిటానియా స్వల్ప వెనకడుగు వేశాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్, రియలీ్ట, ప్రయివేట్‌ బ్యాంక్స్, మెటల్, మీడియా, ఆటో 7–2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. హెవీవెయిట్‌ షేర్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 6 శాతం జంప్‌చేసి మార్కెట్లకు దన్నునిచ్చింది. రూ. 3,021కు చేరడం ద్వారా రూ. లక్ష కోట్ల మార్కెట్‌ విలువను జమ చేసుకుంది. దీంతో మొత్తం మార్కెట్‌ క్యాప్‌ రూ. 20.44 లక్షల కోట్లను దాటింది. షేరు తొలుత రూ. 3,029 వద్ద రికార్డ్‌ గరిష్టానికి చేరింది. ప్రభుత్వ షేర్ల పరుగుతాజా ర్యాలీలో పలు ప్రభుత్వ రంగ కౌంటర్లు లాభాల పరుగు తీశాయి. దీంతో ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్, కోల్‌ ఇండియా 9.5–4.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఇతర బ్లూచిప్స్‌లో శ్రీరామ్‌ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, అ్రల్టాటెక్, ఇండస్‌ఇండ్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్‌ త్రయం, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, గ్రాసిమ్, కొటక్‌ బ్యాంక్‌ 7–2.5 శాతం మధ్య ఎగశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో బీవోబీ, ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్‌ ఒక దశలో 52 వారాల గరిష్టాలకు చేరాయి. పీఎస్‌యూగా ఎస్‌బీఐ తొలిసారి రూ. 8 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను సాధించడం విశేషం!విదేశీ పెట్టుబడుల జోరు బీఎస్‌ఈ నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లుతాజాగా రూ. 6,851 కోట్ల పెట్టుబడులను పంప్‌ చేశారు. డీఐఐలు సైతం రూ. 1,914 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. గత వారాంతాన సైతం ఎఫ్‌పీఐలు రూ. 1,613 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. బీఎస్‌ఈ సూచీలలో మిడ్‌ క్యాప్‌ 3.5 శాతం, స్మాల్‌ క్యాప్‌ 2 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,346 లాభపడితే.. 1,615 మాత్రమే నష్టపోయాయి.అదానీ షేర్ల మెరుపులుప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న అంచనాలకుతోడు, జఫరీస్‌ బ్రోకింగ్‌ బయ్‌ రేటింగ్‌తో తాజాగా అదానీ గ్రూప్‌ కౌంటర్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో గ్రూప్‌లోని అన్ని లిస్టెడ్‌ షేర్లు 4% నుంచి 16% వరకు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ఫలితంగా గ్రూప్‌లోని మొ త్తం 10 కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 19.42 లక్షల కోట్లను అధిగమించింది.రూపాయి ర్యాలీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ మెజారిటీపై అంచనాలతో స్టాక్‌ మార్కెట్లతోపాటు దేశీ కరెన్సీ సైతం జోరందుకుంది. దీంతో డాలరుతో మారకంలో రూపాయి 28 పైసలు బలపడింది. తద్వారా 2023 నవంబర్‌ 15 తదుపరి(24 పైసలు) ఒకే రోజు రూపాయి అత్యధికంగా పుంజుకుంది. వెరసి రెండు నెలల గరిష్టం 83.14 వద్ద ముగిసింది. ఇంతక్రితం మార్చి 21న 83.13 వద్ద నిలిచింది. ఉత్పత్తిని యథాతథంగా కొనసాగించే ఒపెక్‌ నిర్ణయంతో చమురు ధరలు బలహీనపడటం సైతం రూపాయికి ప్రోత్సాహాన్నిచి్చనట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి తొలుత 83.09 వద్ద హుషారుగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82.95 వద్ద గరిష్టాన్ని తాకగా.. 83.17 వద్ద కనిష్టానికీ చేరింది. చివరికి 83.14 వద్ద స్థిరపడింది. వారాంతాన రూపాయి 13 పైసలు నీరసించి 83.42 వద్ద నిలిచిన సంగతి తెలిసిందే. స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులు, జీడీపీ, జీఎస్‌టీ గణాంకాలు సైతం రూపాయికి దన్నునిచి్చనట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

New 6960 people get pension at home: andhra pradesh
98.89 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 98.89 శాతం మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ రకాల చేతి వృత్తిదా­రులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ నెల పింఛన్ల పంపిణీ పూర్తయినట్టు సెర్ప్‌ అధికారులు తెలిపారు. డీబీటీ రూపంలో పింఛను డబ్బు బ్యాంకులో జమ చేసిన వారిలో 6,960 మంది బ్యాంకు ఖాతాల్లో ఇబ్బందులు రావడంతో వారికి బదిలీ చేసిన పింఛను డబ్బులు వెనక్కి వచ్చాయని, వీరందరికీ సోమవారం నుంచి ఇంటి వద్దే పింఛను డబ్బు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.ఈ నెల (జూన్‌) 1వ తేదీ నుంచి మొత్తం 65,30,838 మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 1,939.35 కోట్లు విడుదల చేసింది. వీరిలో 47,67,773 మందికి పింఛను సొమ్మును డీబీటీ రూపంలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు అధికారులు చెప్పారు. 17,63,065 మందికి ఇంటి వద్ద పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీరిలో 16,90,945 మందికి పంపిణీ పూర్త­యినట్టు వివరించారు. బ్యాంకులో డబ్బు జమ చేసిన లబ్ధిదారులతో కలిపి సోమవారం సాయంత్రం వరకు మొత్తం 64.58 లక్షల మందికి రూ. 1,919.07 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement