బ్రిడ్జిపై నుంచి కింద పడ్డ కారు: 10 మంది మృతి | Sakshi
Sakshi News home page

బ్రిడ్జిపై నుంచి కింద పడ్డ కారు: 10 మంది మృతి

Published Wed, Aug 19 2015 8:57 AM

10 die as truck crashes, burns, falls from bridge in Mexico

మెక్సికో నగరం: బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ ట్రైలర్ రిగ్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో కారును ఢీ కొట్టింది. దాంతో కారు బ్రిడ్జిపై నుంచి కింద పడి.. మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో  కారులోని 10 మంది అగ్ని ఆహుతి అయ్యారు. ఈ మేరకు ఉన్నతధికారులు వెల్లడించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత చోటు చేసుకుందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Advertisement
Advertisement