విద్యార్థినిపై ఇద్దరు మహిళ టీచర్ల లైంగికదాడి | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై ఇద్దరు మహిళ టీచర్ల లైంగికదాడి

Published Sat, Nov 5 2016 1:48 PM

2 Bihar teachers arrested for alleged sex with LKG student

పట్నా: అభంశుభం తెలియని ఆరేళ్ల బాలికను లైంగికంగా హింసించిన కేసులో ఇద్దరు మహిళా టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ రాజధాని పట్నాలోని ఓ మిషనరీ స్కూల్లో ఈ దారుణం జరిగింది.

పట్నాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో బాధితురాలు ఎల్కేజీ చదువుతోంది. ఇద్దరు మహిళా టీచర్లు స్కూల్లోనే ఆ అమ్మాయి పట్లా దారుణంగా ప్రవర్తించేవారు. టీచర్లు ఈ బాలికను ఓ గదిలో తీసుకెళ్లి అసభ్యకర చేష్టలు చేసేవారు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధితురాలి తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. నిందితులను మహిళా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. పోలీసులు స్కూలు ప్రిన్సిపాల్ ఫాదర్ జాకబ్ను కూడా విచారించారు. బాలికపై లైంగికదాడి జరిగినట్టు వైద్య నివేదికలో తేలింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు స్కూలుకు వెళ్లి ఆధారాలు సేకరించారు. టీచర్లు నేరం చేసినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement