భారత్‌లో 32 లక్షల కార్డులు హ్యాక్‌ | Sakshi
Sakshi News home page

భారత్‌లో 32 లక్షల కార్డులు హ్యాక్‌

Published Thu, Feb 9 2017 4:23 PM

భారత్‌లో 32 లక్షల కార్డులు హ్యాక్‌

ఆన్లైన్ భద్రతను సవాలు చేస్తూ గతేడాది అక్టోబర్లో వెలుగులోకి వచ్చిన అతిపెద్ద సైబర్ అటాక్స్పై హిటాచి పేమెంట్ సర్వీసెస్ స్పందించింది. భారత్లో 32 లక్షల డెబిట్ కార్డులు హ్యాకయ్యాయని హిటాచి పేమెంట్ సర్వీసెస్ ఒప్పుకుంది. యస్ బ్యాంకుకు సేవలందిస్తున్న హిటాచీ పేమెంట్ సర్వీసెస్ అనే సంస్థ కంప్యూటర్లోకి మాల్వేర్(దొంగ సాఫ్ట్వేర్)ను పంపి వినియోగదారుల సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది. ఈ ఏటీఎం నెట్వర్క్ అన్ని బ్యాంకులతో అనుసంధానమై ఉండటం వల్ల బ్యాంకు ఖాతాదారుల సమాచారం చైనా దొంగల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ వ్యవహారం మే, జూన్‌ల్లోనే జరిగినప్పటికీ తమ ఖాతాల్లోని సొమ్ము పోయిందని వినియోగదారులు సెప్టెంబరు, అక్టోబర్లో ఫిర్యాదులు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
600కు పైగా కస్టమర్లు ఈ హ్యాంకింగ్లో నష్టపోయారని, వారి లావాదేవీల విలువ రూ. 1.3 కోట్లు దొంగతనానికి గురైనట్టు నేషనల్  పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం మీడియాకు హ్యాకింగ్ జరిగినట్టు ధృవీకరించిన హిటాచి పేమెంట్ సర్వీసెస్, తమ భద్రతా చర్యలపై ఎప్పడికప్పుడూ సమీక్షిస్తున్నామని పేర్కొంది. ''మిడ్-2016లో మా సెక్యురిటీ సిస్టమ్స్ దొంగతనానికి గురైనట్టు ఒప్పుకుంటున్నాం. త్వరలోనే ఈ దొంగతనాన్ని కనిపెడతాం. కనిపెట్టిన వెంటనే ఆ వివరాలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలకు వివరిస్తాం. తమ ఖాతారులు సెన్సిటివ్ డేటాను భద్రంగా ఉంచడానికి బ్యాంక్స్, డెబిట్ కార్డు స్కీమ్స్ను తీసుకొస్తున్నాం'' అని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ లోని ఆంటోని తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement