జపాన్ కంపెనీతో 3ఎఫ్ జట్టు | Sakshi
Sakshi News home page

జపాన్ కంపెనీతో 3ఎఫ్ జట్టు

Published Sat, Jan 18 2014 1:26 AM

3F, Fuji Oil of Japan to set up non-dairy cream plant

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాలు లేకుండా పామాయిల్, సోయాతో తయారు చేసే ఐసీక్రీం, కేకులు తయారు చేసే నాన్ డెయిరీ ఉత్పత్తుల కేంద్రం రాష్ట్రంలో ఏర్పాటవుతోంది. ఎటువంటి కొవ్వు పదార్థాలు లేకుండా ఆరోగ్యానికి హాని చేయని ఈ నాన్ డెయిరీ ఉత్పత్తుల కేంద్రం మహబూబ్‌నగర్ జిల్లా బుర్గుల్‌లో ఏర్పాటవుతోంది. జపాన్‌కు చెందిన ఫ్యుజి ఆయిల్, రాష్ట్రానికి చెందిన 3ఎఫ్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ‘3ఎఫ్ ఫ్యుజి ఫుడ్స్’పేరుతో నాన్ డెయిరీ ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇరు కంపెనీల మధ్య హైదరాబాద్‌లో ఒప్పందం కుదిరింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 3ఎఫ్ ఇండస్ట్రీస్ డెరైక్టర్ సుషిల్ గొయెంక మాట్లాడుతూ రూ.100 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ మార్చి, 2015 నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ భాగస్వామ్య కంపెనీలో ఫ్యుజికీ 55 శాతం వాటా ఉంటే, మిగిలిన 45 శాతం వాటా 3ఎఫ్ ఇండస్ట్రీస్ కలిగి ఉంటుంది.  15 ఎకరాల్లో రోజుకు 500 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సుషీల్ తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 5,000 టన్నుల అమ్మకాలు జరపాలన్నది లక్ష్యమన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement