నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న లైంగిక దాడి | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న లైంగిక దాడి

Published Mon, Oct 31 2016 8:02 PM

నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న లైంగిక దాడి - Sakshi

మాదల (ముప్పాళ్ల) : అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఆమె పెదనాన్నే లైంగికదాడికి పాల్పడిన దారుణ సంఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..

ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలోని కాలనీకి చెందిన జెల్ది లోకయ్య గురువారం (నవంబర్ 27న) విపరీతంగా మద్యం సేవించాడు. సాయంత్రం 5 గంటల సమయంలో లోకయ్య తమ్ముడి కూతురు(4) ఇంటిముందు ఆడుకుంటోంది. ఆ చిన్నారిని పక్కకుపిలిచి ఏవేవో మాటలు చెప్పి పక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రం వెనుకకు తీసుకెళ్లిన లోకయ్య.. ఆమెపై లైంగిక దాడి జరిపాడు. తీవ్రఅస్వస్థతకు గురైన చిన్నారిని ఆమె తల్లిదండ్రులు సత్తెనపల్లిలోని ఆస్పత్రికి తీసుకెళ్లాకగానీ ఈ దారుణం బయటపడలేదు.

బాలిక చెప్పిన వివరాల ఆధారంగా తల్లిదండ్రులు శనివారం (29న) ముప్పాళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టామని, వైద్యపరీక్షల నిమిత్తం బాలికను గుంటూరు జీజీహెచ్ కు తరలించామని సత్తెనపల్లి రూరల్ సి.ఐ. కోటేశ్వరరావు మీడియాకు తెలిపారు. నిందితుడు లోకయ్య పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement