బాణసంచా దుకాణంలో ఘోర ప్రమాదం | Sakshi
Sakshi News home page

బాణసంచా దుకాణంలో ఘోర ప్రమాదం

Published Fri, Oct 28 2016 8:11 PM

బాణసంచా దుకాణంలో ఘోర ప్రమాదం - Sakshi

వడోదర: గుజరాత్లోని వడోదరలో ఘోర ప్రమాదం జరిగింది. దీపావళి పండగ సందర్భంగా అమ్మేందుకు తీసుకువచ్చిన బాణసంచాను ఉంచిన దుకాణంలో శుక్రవారం సాయంత్రం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు.

పోలీసులు, అధికారులు వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement
Advertisement