Sakshi News home page

వాతావరణ మార్పులపై బృహత్ ప్రణాళిక

Published Wed, Aug 5 2015 12:36 AM

వాతావరణ మార్పులపై బృహత్ ప్రణాళిక

ఆవిష్కరించిన అధ్యక్షుడు ఒబామా
 
వాషింగ్టన్: అమెరికా థర్మల్ పవర్‌ప్లాంట్ల ద్వారా వాతావరణంలో కలుస్తున్న గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించే ఒక భారీ ప్రణాళికను అధ్యక్షుడు  ఒబామా సోమవారం ఆవిష్కరించారు. మానవాళి భవిష్యత్‌కు వాతావరణంలో వచ్చే మార్పులే అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు. 2030 నాటికి దేశంలోని విద్యుత్ ప్లాంట్ల కర్బన కాలుష్యం 32 శాతం వరకూ తగ్గుతుందన్నారు.

ఉద్గారాల తగ్గింపుపై అమెరికా ముందడుగు వేస్తేనే ఇతర దేశాలూ అనుసరిస్తాయని, తమ దేశాన్ని చూసే చైనా కూడా చర్యలు ప్రారంభించిందని ఒబామా పేర్కొన్నారు. అంతకుముందు ఉద్గారాల తగ్గింపుపై భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు తీసుకుంటున్న చర్యలను వైట్ హౌస్ ఉదహరించింది.
 

Advertisement
Advertisement