రాజకీయాల్లోకి వచ్చిన మరో హీరోయిన్ | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి వచ్చిన మరో హీరోయిన్

Published Tue, Jan 24 2017 7:28 PM

రాజకీయాల్లోకి వచ్చిన మరో హీరోయిన్ - Sakshi

న్యూఢిల్లీ: మరో హీరోయిన్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. బాలీవుడ్‌తో పాటు తెలుగు, దక్షిణాది సినిమాల్లో నటించిన రిమీ సేన్ బీజేపీలో చేరారు. మంగళవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వార్గియా సమక్షంలో ఆమె పార్టీలోకి వచ్చారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు.

ఈ సందర్భంగా రిమీ సేన్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. తనకు ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. పలు విజయవంతమైన సినిమాల్లో, అగ్ర హీరోల సరసన నటించిన రిమీ సేన్.. 2015లో  రియాల్టీ షో బిగ్ బాస్లో పాల్గొన్నారు. నిర్మాతగా ఓ సినిమా తీశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement