మౌంట్ ఎవరెస్ట్ మీదుగా నేపాల్కు రైలు | Sakshi
Sakshi News home page

మౌంట్ ఎవరెస్ట్ మీదుగా నేపాల్కు రైలు

Published Fri, Apr 10 2015 10:27 AM

మౌంట్ ఎవరెస్ట్ మీదుగా నేపాల్కు రైలు

బీజింగ్ : భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటున్న డ్రాగన్ మరో ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది.  భారత్ మార్కెట్లోకి సులభంగా ప్రవేశించేందుకు చైనా రంగంలోకి దిగింది. చైనా నుంచి నేపాల్కు ప్రపంచంలో అత్యంత ఎతైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ మీదుగా రైలు మార్గం వేయాలని నిర్ణయించినట్లు ఆ దేశ రైల్వే రంగం నిపుణుడు వాంగక మెంగ్ష్ స్థానిక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

టిబెట్ ప్రాంతంలోని మౌంట్ ఎవరెస్ట్ కొమలంగ్మా శిఖరం అడుగు భాగాన సొరంగం తవ్వనున్నట్లు తెలిపారు. భారీ పొడవైన సొరంగం నిర్మించవలసి ఉంటుందన్నారు. పర్వత ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ... ఈ నేపథ్యంలో రైలు వేగం 120 కిలోమీటర్లు మించకూడదని వాంగక మెంగ్ష్ పేర్కొన్నారు.


చైనా గతంలో నేపాల్తో వ్యాపారం బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు క్వింగ్హై - లాసా మార్గంపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి. అయితే కొత్తగా  సొరంగ మార్గం ద్వారా నేపాల్కు రైల్వే లైన్ నిర్మించాలని చైనా నిర్ణయించింది. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లలో ఒక్కటైన భారత్లో ప్రవేశించేందుకు నేపాల్ రైలు మార్గాన్ని చైనా ఉపయోగించుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement