అంగుళం దూరంలో.. మృత్యువు ఆగింది..! | Sakshi
Sakshi News home page

అంగుళం దూరంలో.. మృత్యువు ఆగింది..!

Published Fri, Jul 4 2014 5:29 PM

అంగుళం దూరంలో.. మృత్యువు ఆగింది..!

దూరం, కాలం, వేగంలతో లెక్కల్లో ఎన్ని సూత్రాలున్నాయో కానీ.. అంగుళమంత దూరం, క్షణ కాలం, రైలంత వేగంతో మృత్యువు ఒక మనిషిని చేరితే ఎలా ఉంటుంది ? ఆలోచించడానికి కూడా అవకాశం లేదు కదూ ? మరి అంత దగ్గరకొచ్చిన మృత్యువు నుండి బయటపడితే ? ఆ బయటపడిన వ్యక్తి గర్భిణీ అయితే ?.. ఇలాంటిదే ఒక సంఘటన చైనాలో చోటుచేసుకుంది.


చైనాలోని బీజింగ్‌లో ఒక గర్భిణీ మహిళ స్పృహ తప్పి సబ్‍‌వే ట్రాక్‌పై పడిపోయింది. అప్పటికే ఆ ట్రాక్‌పై వస్తున్న రైలు ఆమె వైపుకు దూసుకువస్తుంది... దాదాపుగా మీదకొచ్చేసింది. ఆ రైలు ఆమె మీదకి ఎక్కేసిందనుకున్నారంతా. కానీ అప్పటికే బండిని అదుపులోకి తెచ్చిన డ్రైవర్ ఆమె మీదకు వెళ్లకుండా ఆపగలిగాడు. క్షణాల్లో అంతా మ్యాజిక్‌లా జరిగిపోయింది. చిన్నపాటి గాయాలతో ఆ మహిళ బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement