ఐఫోన్ వ్యసనం నుంచి బయటపడే అప్లికేషన్! | Sakshi
Sakshi News home page

ఐఫోన్ వ్యసనం నుంచి బయటపడే అప్లికేషన్!

Published Tue, Jul 1 2014 8:25 PM

ఐఫోన్ వ్యసనం నుంచి బయటపడే అప్లికేషన్!

 లండన్: యాపిల్ ఐఫోన్‌ను విపరీతంగా వాడేస్తున్నారా? క్షణానికోసారి ఫోన్‌వంక చూస్తున్నారా? ఇంట్లోవారితో కన్నా ‘యాప్స్’తో ఎక్కువ సమయం గడిపేస్తున్నారా? సోషల్ నెట్‌వర్కింగ్‌లో గంటలు క్షణాలుగా గడిచిపోతున్నాయా? వీటన్నింటికీ అవునని సమాధానం వస్తే...మీరు ఐఫోన్‌కు బానిసలైపోయినట్లే. ఇప్పుడా వ్యసనం నుంచి బయటపడేసే ఒక అప్లికేషన్ ఐఫోన్ యాప్ స్టోర్‌లో సిద్ధంగా ఉంది.

 మీ ఫోన్‌తో మీరు గడిపిన సమయాన్ని లెక్కించి, ఎక్కువగా వాడుతున్నారనిపిస్తే హెచ్చరించే యాప్ అది. కెవిన్ హాల్ష్ రూపొందించిన ‘మూమెంట్’ అనే ఆ యాప్‌లో ఫోన్‌ను ఉపయోగించే రోజువారీ లిమిట్‌ను కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ లిమిట్ దాటగానే ఆ యాప్ మీకో అలర్ట్ నోటీస్ పంపిస్తుంది.

Advertisement
Advertisement