ఆండ్రాయిడ్ సరికొత్త వెర్షన్కు మరో చాక్లెట్ పేరు | Sakshi
Sakshi News home page

ఆండ్రాయిడ్ సరికొత్త వెర్షన్కు మరో చాక్లెట్ పేరు

Published Tue, Aug 18 2015 6:06 PM

ఆండ్రాయిడ్ సరికొత్త వెర్షన్కు మరో చాక్లెట్ పేరు - Sakshi

ప్రతిసారీ ఏదో ఒక చాక్లెట్ పేరును తన ఆండ్రాయిడ్ వెర్షన్లకు పెట్టే గూగుల్.. ఈసారి విడుదల చేసే సరికొత్త 6.0 వెర్షన్కు కూడా ఓ పేరు ఎంపిక చేసుకుంది. ఈ కొత్త పేరు మార్ష్మలో. ఇది కూడా ఒక లాంటి చాక్లెట్టే కావడం విశేషం. ఇప్పటివరకు గూగుల్ తన ఆండ్రాయిడ్ వెర్షన్లకు పెట్టిన పేర్లు చాలావరకు భారతీయులకు బాగా తెలిసినవే. అందుకే.. అందరికీ బాగా తెలిసున్న ఈ మార్ష్మలోను ఈసారి ఆండ్రాయిడ్ వెర్షన్గా ఎంచుకున్నారు.

ఇంతకుముందు 4.0 వెర్షన్కు ఐస్క్రీం శాండ్విచ్, 4.1కు జెల్లీబీన్, 4.4కు కిట్క్యాట్, 5.0కు లాలీపాప్ అనే పేర్లను గూగుల్ ఎంపిక చేసుకుంది. ఇవన్నీ కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ బాగా నచ్చిన చాక్లెట్లే. అందుకే ఈసారి కూడా అందరికీ నచ్చే, అందరూ మెచ్చే పేరును గూగుల్ ఎంపిక చేసుకుంది. ఈ కొత్త వెర్షన్లో ప్రధానంగా ఫింగర్ ప్రింట్ సెన్సర్లు, అప్డేట్ చేసిన పవర్ సేవింగ్ మోడ్ ఉంటాయని చెబుతున్నారు. అలాగే, ఏవైనా యాప్లను అప్గ్రేడ్ చేయాలంటే ఆటోమేటిగ్గా కాకుండా.. యూజర్ అనుమతితో మాత్రమే చేసేలా ఈ కొత్త వెర్షన్ స్ట్రీమ్లైన్ చేస్తుందట.

Advertisement
Advertisement