Sakshi News home page

నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా లండన్ లో నిరసన ప్రదర్శన!

Published Tue, Sep 10 2013 6:08 PM

నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా లండన్ లో నిరసన ప్రదర్శన! - Sakshi

 
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దక్షిణాసియా మానవ హక్కుల ఉద్యమ కార్యకర్తలు లండన్ లో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. యూకేలో పర్యటించడానికి నరేంద్రమోడీకి ఆహ్వానించడానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. లండన్ లోని లేబర్ పార్టీ ఎంపీ బ్యారీ గార్డినెర్ కార్యాలయం ముందు ది సౌత్ ఆసియా సాలిడారిటీ గ్రూప్ తోపాటు మరో పది సంస్థలు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నాయి.  
 
'ది ఫ్యూచర్ ఆఫ్ మోడర్న్ ఇండియా' అనే అంశంపై హౌజ్ ఆఫ్ కామన్స్ లో జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించడానికి ఆహ్వనం పంపడంపై అనేక చర్చలకు దారి తీసాయి. అయితే ఇప్పట్లో యూకేలో మోడీ పర్యటించే అవకాశం లేదని బ్యరీ గార్డినెర్ వివరణ ఇచ్చారు. యూకే పర్యటనపై మోడీ అనాసక్తిని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement