జగన్కు ఏపీ భవన్ సీమాంధ్ర కన్వీనర్ సంఘీభావం | Sakshi
Sakshi News home page

జగన్కు ఏపీ భవన్ సీమాంధ్ర కన్వీనర్ సంఘీభావం

Published Mon, Aug 26 2013 11:42 AM

AP Bhavan seemandhra convener support to YS Jagan deeksha

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు ఏపీ భవన్ సీమాంధ్ర ఉద్యోగుల కన్వీనర్ బాలకోటేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు. చంచల్గూడ జైల్లో ఉన్న వైఎస్ జగన్ దీక్ష చేయడం గర్వించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఏపీభవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయనతోపాటు ఆర్టీసీ ఎన్ఎంయూ నేత ప్రసాదరావు, సమైక్యాంధ్ర విద్యర్థి జేఏసీ కన్వీనర్ కిషోర్ ప్రసంగించారు.

 

సీమాంధ్ర కేంద్రమంత్రులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని కిషోర్ డిమాండ్ చేశారు. ఆ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు ప్రజలతో సంబంధం లేకుండా ప్రతిపాదనలు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచాలని రాష్ట్రపతి, ప్రధాని, ప్రతిపక్ష నేతలను కలసి విజ్ఞప్తి చేస్తామన్నారు.

 

విభజన సమస్యలపై ఏర్పాటు అయిన ఆంటోని కమిటీని కలసి తమ వాదనలు వినిపిస్తామని కిషోర్ స్ఫష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం ఏ పోరాటానికైనా సిద్దంగానే ఉన్నామని ఆర్టీసీ ఎన్ఎంయూ నేత ప్రసాదరావు పేర్కొన్నారు. తమ సంస్థ కార్మికులు దాదాపు 14 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement