ఆపిల్ సీఈవోకు జీతం కట్! | Sakshi
Sakshi News home page

ఆపిల్ సీఈవోకు జీతం కట్!

Published Fri, Jan 6 2017 8:26 PM

ఆపిల్ సీఈవోకు జీతం కట్! - Sakshi

టెక్ దిగ్గజం ఆపిల్ తన టాప్ ఎగ్జిక్యూటివ్, సీఈవో టిమ్ కుక్కు ఝలకిచ్చింది.. రెవన్యూలు, లాభాలు లక్ష్యాలను చేధించలేకపోవడంతో 2016లో ఆయనకు అందించే పరిహారాలను తగ్గించేసింది. సెక్యురిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కు సమర్పించిన ప్రకటనలో టిమ్ కుక్ గతేడాది 2016లో ఆర్జించిన మొత్తం పరిహారం 8.75 మిలియన్ డాలర్ల(రూ.59 కోట్లకుపైగా)గా ఆపిల్ పేర్కొంది. ఆయన జీతం 1 మిలియన్ డాలర్లు పెరిగినప్పటికీ, ఏడాదికి ఆయనకు అందే పరిహారం మాత్రం తగ్గిపోయినట్టు చెప్పింది. 2015లో టిమ్ కుక్ 10.28 మిలియన్ డాలర్ల(రూ.69 కోట్లకు పైగా) ఆదాయన్ని ఆర్జించారు.
 
వారి టార్గెట్ వార్షిక ప్రోత్సహకాల్లో భాగంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్లు 89.5 శాతం పొందుతారు. కానీ కంపెనీ వార్షిక విక్రయాలు దాదాపు 4 శాతం మందగించాయి. 223.6 బిలియన్ డాలర్లగా పెట్టుకున్న లక్ష్యాన్ని కంపెనీ చేధించలేకపోయింది. నిర్వహణ ఆదాయం 0.5 శాతం పడిపోయింది. మొత్తంగా 2016లో కంపెనీ నికర విక్రయాలు, నిర్వహణ ఆదాయాలు 7.7 శాతం, 15.7 శాతం పడిపోయినట్టు ఆపిల్ పేర్కొంది. ఇది ఎగ్జిక్యూటివ్ పరిహారంపై పడినట్టు తెలిపింది. గత 15 ఏళ్లలో మొదటిసారి ఆపిల్ తన రెవెన్యూలను కోల్పోయింది. 
 

Advertisement
Advertisement