యూజర్లపై స్నాప్‌చాట్‌ సీఈవో తలపొగరు వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

యూజర్లపై స్నాప్‌చాట్‌ సీఈవో తలపొగరు వ్యాఖ్యలు

Published Sat, Apr 15 2017 7:52 PM

యూజర్లపై స్నాప్‌చాట్‌ సీఈవో తలపొగరు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఒకవైపు సోషల్‌మీడియా దిగ్గజాలు  భారత మార్కెట్‌లో పాగా వేసేందుకు  పోటీ పడుతోంటే స్నాప్‌చాట్‌ సీఈవో ఇవాన్ స్పీగెల్ మాత్రం సంచలన వ్యాఖ్యలు  చేశాడు.  తమ వ్యాపారాన్ని విస్తరించేంత సీన్‌ భారత్‌కు లేదన్నట్టు  ప్రవర్తించాడు. భారతదేశంలాంటి  పేద దేశంలో స్నాప్‌చాట్‌ వ్యాపార విస్తరణ అవసరం లేదని  వ్యాఖ్యానించాడు.  తమ యాప్‌ కేవలం ధనికులకోసతే తప్ప పేదోళ్లకి  కాదంటూ నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించడం  విస్తుగొలిపింది. అంతేకాదు ఇండియా, స్పెయిన్‌ లాంటి పేద దేశాల్లో  విస్తరించాలని తాను కోరుకోవడంలేదని  పేర్కొన్నాడు.

తన మెసేజింగ్‌ యాప్‌  స్నాప్‌ చాట్‌ ధనవంతులకే తప్ప పేదవాళ్లకి కాదని ఇవాన్‌ పేర్కొన్నాడు. కేవలం ప్రీమియం  యూజర్లపైనే తాము దృష్టి పెట్టినట్టు చెప్పాడు.  ఇండియా, స్పెయిన్‌ పేద దేశాల్లో తన వ్యాపారాన్ని విస్తరించదల్చుకోలేదంటూ  అహంకారాన్ని ప్రదర్శించాడు.2015 సం.రంలో స్నాప్‌ చాట్‌ యూజర్‌ బేస్‌ వృద్ధిపై నిర్వహించిన సమావేశాలో  ఇవాన్‌  స్పీగెల్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్టు వెరైటీ మీడియా రిపోర్ట్‌ చేసింది.

కాగా స్నాప్‌ చాట్‌ మాజీ ఉద్యోగి ఆంథోనీ పాంప్లియానో   ఇన్వెస్టర్లను, వ్యాపార భాగస్వాములను మోసం చేస్తోందని ఆరోపిస్తూ  కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా  ఇండియా, స్పెయిన్‌ లాంటి దేశాల్లో పొటెన్షియల్‌ గ్రోత్‌ పై దృష్టి పెట్టాలని సూచించాడు. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా  వెరైటీ మీడియా నివేదించింది.  భారత్‌, స్పెయిన్ వంటి దేశాల్లో స్నాప్‌చాట్‌కు వృద్ధి అవకాశాలు ఉన్నాయని చెప్పానని, అప్పుడు స్పీగెల్ జోక్యం చేసుకుని ‘‘స్నాప్‌చాట్ కేవలం సంపన్నులకు మాత్రమే’’నని చెప్పి, తన మాటలను అడ్డుకున్నారని ఫిర్యాదులో ఆంథోనీ ఆరోపించినట్లు ‘వెరైటీ’ కథనం తెలిపింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement