గగుర్పాటుకు గురిచేసిన వింత ఆకారం.. | Sakshi
Sakshi News home page

గగుర్పాటుకు గురిచేసిన వింత ఆకారం..

Published Fri, Aug 5 2016 11:11 AM

గగుర్పాటుకు గురిచేసిన వింత ఆకారం..

చేపలవేటకు వెళ్లిన తండ్రీకొడుకులును.. నడి సముద్రంలో ఓ వింత ఆకారం గగుర్పాటుకు గురిచేసింది. తాము ఎన్నడూ చూడని ఆ ఆకారం గ్రహాంతర వాసిదై ఉంటుందేమోనని భ్రమపడ్డ ఆ ఇద్దరికి.. కాస్త దగ్గరికి వెళ్లాకగానీ అసలు విషయం అర్థంకాలేదు! పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన 36 ఏళ్ల మార్క్ వాట్కిన్స్ జాలరి. గత వారం తండ్రితో కలిసి బోటులో వెళ్లాడు. పెర్త్ తీరం నుంచి 25 నాటికన్ మైళ్ల దూరం వెళ్లినవారికి ఓ వింత ఆకారం కనిపించింది.

ఏళ్లుగా సముద్రంలోకి వెళ్లొస్తున్నా అలాంటి ఆకారాన్ని వాళ్లెప్పుడూ చూడలేదట! మొదట దాన్నొక ఏలియన్ గా భావించామని, కొద్దిగా దగ్గరికి వెళ్లిన తర్వాత.. ఎయిర్ బెలూన్ అయి ఉండొచ్చనుకున్నామని.. చివరికి అది చనిపోయిన తిమింగలమని తేలడంతో ఊపిరిపీల్చుకున్నామని మార్క్ చెప్పాడు. చనిపోయి, వెల్లకిలా తేలిన తిమింగలం పొట్టలో గ్యాస్ పేరుకుపోవడంతో విపరీతంగా ఉబ్బిపోయిందని, అయితే కుళ్లినవాసనేదీ రాలేదని మార్క్ పేర్కొన్నాడు. ఈ మేరకు తన వింత అనుభవానికి సంబంధించిన ఫొటోలు, వివరాలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ప్రపంచంలోని అన్ని వార్తా సంస్థలు మార్క్ తీసిన వింత ఆకారం ఫొటోలను ప్రచురించాయి. ఒకవేళ నిజంగానే అది గ్రహాంతర జీవి అయ్యేదుంటే ఏం జరిగి ఉండేదో ఊహించగలరా?


Advertisement
Advertisement