వాజపేయికి ‘బంగ్లా’ అవార్డు | Sakshi
Sakshi News home page

వాజపేయికి ‘బంగ్లా’ అవార్డు

Published Tue, Jun 2 2015 2:45 AM

bangla award to vajapeyi

ఢాకా: బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత మాజీ ప్రధాని వాజపేయికి ‘ఫ్రెండ్స్ ఆఫ్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అవార్డు’ను ప్రకటించింది. 1971లో పాక్‌తో విముక్తి పోరాటంలో భాగంగా బంగ్లా స్వాతంత్య్రానికి ఆయన ఇచ్చిన మద్దతు దృష్ట్యా ఈ అవార్డు ప్రకటించినట్లు ఆ దేశ విదేశాంగ ప్రతినిధి తెలిపారు. అవార్డును జూన్ 6న వాజపేయి తరఫున తమ దేశానికి రానున్న భారత ప్రధాని మోదీకి అందజేయనున్నట్లు వెల్లడించారు. ‘1971లో భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా, లోక్‌సభ ఎంపీగా ఉన్న వాజపేయి బంగ్లా విముక్తి పోరాటానికి భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టడంలో విశేషంగా కృషి చేశారు’ అని బంగ్లా  అధికారులు చెప్పారు.

Advertisement
Advertisement