వాట్సాప్లో బెగ్గర్స్ హల్ చల్ | Sakshi
Sakshi News home page

వాట్సాప్లో బెగ్గర్స్ హల్ చల్

Published Mon, Jun 8 2015 5:03 PM

వాట్సాప్లో బెగ్గర్స్ హల్ చల్

దుబాయ్: దుబాయ్లో రామదాన్ ప్రాంతంలో బెగ్గర్స్ హల్ చల్ ఎక్కువవుతోంది. స్మార్ట్ ఫోన్లతో వారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా 'సఫరింగ్ అండ్ నీడ్'(బాధ, అవసరం) అనే పదాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ పోలీసులకు ఆగ్రహంతో పాటు తలనొప్పిగా తయారయ్యారు. వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ పదాలను పంపించి వారి నుంచి అడుక్కుతినే పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు. సానుభూతి పొందాలని చిన్న పిల్లలను ఉపయోగించుకుంటూ వారితో భిక్షమెత్తిస్తున్నారు. దీంతో దుబాయ్ పోలీసు విభాగం వారిని అదుపు చేసేందుకు పకడ్బంధీ చర్యలకు దిగింది. గత ఏడాది పదమూడుమంది చిన్నారులను అదుపులోకి తీసుకుంది.

దీంతోపాటు 'ఒకసారి అందరికోసం' అనే నినాదంతో బెగ్గర్స్ ను అదుపుచేసే చర్యల్లో భాగంగా ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం ఇక నుంచి ఎవరు అడుక్కుంటూ కనిపిస్తారో వారిని ఒక నెల రోజుల పాటు జైలులో వేయడంతోపాటు బహిష్కరిస్తారట. అలాగే, భిక్షమెత్తడం ద్వారా సంపాధించిన సొమ్ము మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకుంటారని చెప్తున్నారు. విదేశాల నుంచి చాలామంది అడుక్కుతిని బతికేందుకు వస్తున్నారని, దానిని నియంత్రించేందుకు ఈ చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. 2009 నుంచి ఇప్పటివరకు 4,136 బెగ్గర్స్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో రామదాన్ అనే ప్రాంతంలోనే 1237 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement