బిల్లుకు బీజేపీ మద్దతు ఇస్తామంది: కమల్‌నాథ్‌ | Sakshi
Sakshi News home page

బిల్లుకు బీజేపీ మద్దతు ఇస్తామంది: కమల్‌నాథ్‌

Published Wed, Feb 12 2014 3:20 PM

బిల్లుకు బీజేపీ మద్దతు ఇస్తామంది: కమల్‌నాథ్‌ - Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపిందని కేంద్రమంత్రి కమల్‌నాథ్‌ చెప్పారు. ప్రధాని నివాసంలో ముగిసిన బీజేపీ నేతల తో విందు సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టేది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

తెలంగాణ బిల్లుపై చర్చించేందుకు బీజేపీ నేతలను ప్రధాని మన్మోహన్ సింగ్ విందుకు పిలిచారు. విభజన బిల్లుపై బీజేపీ నాయకులతో ప్రధాని చర్చించారు.  తెలంగాణకు తమ పార్టీ అనుకూలమని చెప్పిన బీజేపీ నేతలు.. సీమాంధ్ర సమస్యలు పరిష్కరించిన తర్వాతే బిల్లుకు మద్దతిస్తామని పేర్కొన్నట్టు తెలిసింది.  బీజేపీ అగ్రనేతలు ఎల్కె అద్వానీ, రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ విందు సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కమల్‌నాథ్‌, ఏకే ఆంటోనీ, చిదంబరం కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement