నాలుగు రోజుల్లో 6.4 లక్షల కోట్లు ఆవిరి | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లో 6.4 లక్షల కోట్లు ఆవిరి

Published Sat, Aug 12 2017 12:36 PM

Bloodbath on Dalal Street, Rs 6.4 lakh crore gone in 4 days

ముంబై: కేవలం నాలుగు రోజుల్లోనే దేశీయ మదుపుదారుల నుంచి రూ 6.4 లక్షల కోట్లు చేజారాయి. అమెరికా, ఉత్తర కొరియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం, ఆర్థిక వృద్ధి రేటు అంచనాలపై భయాందోళనలతో స్టాక్‌ మార్కెట్‌ కుదేలైంది. అమ్మకాల ఒత్తిడితో కేవలం నాలుగు రోజుల్లోనే రూ 6.4 లక్షల కోట్ల మదుపరుల సొమ్ము ఆవిరైంది.

ఆగస్ట్‌ 7న రూ 139. 5 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ వారం తిరగకుండానే రూ 133 లక్షల కోట్లకు పతనమైంది. గడిచిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1100 పాయింట్లు కోల్పోయింది. మరోవైపు మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ 331 షెల్‌ కంపెనీల్లో ట్రేడింగ్‌ను నిలిపివేయడం కూడా షేర్‌ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. చైనాతో డోక్లాం వివాదం కూడా మదుపుదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది.  గ్లోబల్‌ మార్కెట్లు కుప్పకూలిన క్రమంలో  ప్రపంచ వ్యాప్తంగా లక్ష కోట్ల డాలర్ల మేర ఇన్వెసర్లు నష్టపోయారు.

Advertisement
Advertisement