అగస్టా వ్యవహారంపై కడిగేసిన కాగ్ | Sakshi
Sakshi News home page

అగస్టా వ్యవహారంపై కడిగేసిన కాగ్

Published Tue, Aug 13 2013 3:16 PM

CAG questions government on Augusta choppers procurement

అగస్టా వెస్ట్లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు అంశంలో రక్షణ శాఖ అనుసరించిన విధానాలను కాగ్ కడిగిపారేసింది. అసలు ఆ కంపెనీయే 3,966 కోట్ల రూపాయలకు ఆఫర్ ఇచ్చినప్పుడు, రక్షణశాఖ 4,871.50 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు కొనాల్సి వచ్చిందని నిలదీసింది.
 
రక్షణ శాఖ కొనుగోళ్ల విభాగం మొత్తం 12 హెలికాప్టర్ల కొనుగోలు విషయంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందని కాగ్ విమర్శించింది. ఈ ఒప్పందం విషయంలో పలు సందర్భాల్లో సేకరణ విధానం, టెండర్ల విధానాలను రక్షణ శాఖ అతిక్రమించినట్లు తెలిపింది. అంతేకాక.. 2007 సంవత్సరంలో ఈ హెలికాప్టర్లకు సంబంధించిన పరీక్షలను విదేశాల్లో నిర్వహించాలని నాటి వైమానిక దళ ప్రధానాధికారి తీసుకున్న నిర్ణయాన్ని కూడా కాగ్ ప్రశ్నించింది.

Advertisement
Advertisement