ఈ ఫొటోలో దెయ్యం ఎక్కడుందో చెప్పండి! | Sakshi
Sakshi News home page

ఈ ఫొటోలో దెయ్యం ఎక్కడుందో చెప్పండి!

Published Fri, Jul 1 2016 1:23 PM

Can you spot the ghost? This picture is freaking the Internet out

దాదాపు 116 సంవత్సరాల క్రితం ఓ లెనిన్ మిల్లులో పనిచేసే అమ్మాయిల గ్రూపు దిగిన ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ అందులో దెయ్యం ఉందని భయపడుతున్నారు. మొత్తం 15 మంది అమ్మాయిలు ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అయింది. ఈ ఫోటో లో దెయ్యం ఉంది. గుర్తించండి చూద్దాం..! అంటూ నెటీజన్లు అమ్మాయిల ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు.

ఉత్తర ఐర్లాండ్ లోని బెల్ ఫాస్ట్ పట్టణంలో ఈస్టర్ పండుగ సందర్భంగా మిల్లులో పనిచేసే అమ్మాయిలంతా సరదాగా ఈ ఫోటో దిగారు. ఫోటోలో మొత్తం నాలుగు వరుసల్లో నిలుచున్నారు. రెండో వరుసలో కుడివైపు కూర్చున్న అమ్మాయి భుజం మీద ఎవరో చెయ్యి వేసినట్లు చిత్రంలో కనిపిస్తుడటంతో చూసిన వారంతా షాక్ గురవుతున్నారు.

ఈ ఫోటోను క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణులు ఎలాంటి మార్ఫింగ్ చేయలేదని చెప్తున్నారు. అమ్మాయి భుజం మీద చెయ్యి వేసి ఉన్నట్లు కనిపిస్తుండటం ఆప్టికల్ ఇల్యూజన్ గా భావిస్తున్నారు. కాగా, వెబ్ సైట్ లో ఈ ఫోటోను చూసిన ఓ అజ్ఞాత వ్యక్తి మాత్రం భుజం మీద చేయి వేసింది ఆమె అమ్మమ్మ అని కామెంట్ చేశాడు. ఇదే ఫోటో ఆ అమ్మాయి వాళ్ల ఇంట్లో ఇప్పటికీ ఉందని చెప్పాడు.

Advertisement
Advertisement