'భద్రాద్రి రాముడు లేని తెలంగాణను ఊహించలేం' | Sakshi
Sakshi News home page

'భద్రాద్రి రాముడు లేని తెలంగాణను ఊహించలేం'

Published Sun, Nov 17 2013 1:39 PM

Can't Imagine Telangana without Bhadrachalam

న్యూఢిల్లీ: భద్రాచలం తెలంగాణలో అంతర్భాగంగానే ఉండాలని కేంద్ర మంత్రి బలరాం నాయక్‌, రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. భద్రాచలానికి చారిత్రక నేపథ్యం ఉందని, భద్రాద్రి రాముడు లేని తెలంగాణను ఊహించలేమని చెప్పారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసిన తర్వాత బలరాం, రాంరెడ్డి విలేకరులతో మాట్లాడారు.

భద్రాచలంను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలనే డిమాండ్‌తో ఈ నెల 19న జిల్లా బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. ఇతర ప్రాంతాలకు ముంపు లేకుండా పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. రేపు జీఓఎం సమావేశంలోనూ ఇదే చెప్తామన్నారు. మరోవైపు భద్రాచలం డివిజన్లో జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజూ బంద్ కొనసాగుతోంది.

Advertisement
Advertisement