హీరో తనీష్‌ పై కేసు

2 Oct, 2015 09:47 IST|Sakshi
హీరో తనీష్‌ పై కేసు

హైదరాబాద్: సినీ హీరో తనీష్‌పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో న్యూసెన్స్ కేసు నమోదైంది. గురువారం రాత్రి హీరో తనీష్ తన కారులో జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ముందు వెళ్తున్న సురేష్ అనే స్కూటరిస్టును ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయాడు. దీంతో బాధితుడు కారును వెంబడించి జూబ్లీహిల్స్ చెక్ పోస్టులో అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.  దీంతో పోలీసులు ఇద్దరిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు