కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు సీబీఐ క్లీన్ చిట్! | Sakshi
Sakshi News home page

కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు సీబీఐ క్లీన్ చిట్!

Published Thu, Sep 19 2013 8:55 PM

కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు సీబీఐ క్లీన్ చిట్! - Sakshi

ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కు పెద్ద ఊరట లభించింది. ఈకేసులో షిండేకు దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ క్లీన్ చిట్ ఇచ్చింది.  
 
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి తప్పిదాలు చేయలేదని హైకోర్టుకు సీబీఐ ఓ అఫిడవిట్ ఇచ్చింది. సీబీఐ చేస్తున్న దర్యాప్తులో సుశీల్ కుమార్ షిండే పేరును ఉంచాల్సిన అవసరం లేదని అఫిడవిట్ లో పేర్కొంది. పీఎన్ హరిదాస్, జస్టిస్ పీఎన్ దేశ్ ముఖ్ లతో కూడిన బాంబే హైకోర్టు బెంచ్ తదుపరి విచారణను సెప్టెంబర్ 26 తేదికి వాయిదా వేసింది. 
 
దక్షిణ ముంబైలోని కొలాబాలో వివాదస్పద 31 అంతస్తుల టవర్ లో షిండే బినామీ పేరుతో ఫ్లాట్లను కొనుగోలు చేసాడంటూ సామాజిక కార్యకర్త ప్రవీణ్ వాటేగావంకర్ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టారు. 
 

Advertisement
Advertisement