'అమ్మ' మరణం సుప్రీంకు | Sakshi
Sakshi News home page

'అమ్మ' మరణం సుప్రీంకు

Published Wed, Dec 14 2016 11:31 AM

'అమ్మ' మరణం సుప్రీంకు - Sakshi

చెన్నై:తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి  జయలలిత  అనూహ్య మరణంపై  చెన్నైకు చెందిన  ఓ స్వచ్ఛంద సంస్థ పిటీషన్ దాఖలు చేసింది. ఊహించనిరీతిలో అకస్మాత్తుగా ఆమె కన్నుమూయడం, ఆమెను పరామర్శించడానికి బంధువులు  సహా ఎవరినీ అనుమతించకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో  చెన్నైకి చెందిన ఓ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిల్ వేసింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా  సుప్రీంను కోరింది. అలాగే ఆమె చికిత్సకు సంబంధించిన అన్ని వైద్య రికార్డులను (మెడికల్ డాక్యుమెంట్స్) స్వాధీనం చేసుకోవాలని కోరింది.  

కాగా తీవ్ర జ్వరంతో  అపోలో ఆసుపత్రిలో చేరిన అమ్మ  కోలుకుంటున్నారన్న ఆనందం ఎంతో సేపు నిలవకుండానే కార్డియాక్ అరెస్ట్ తో  ఈ లోకాన్ని వీడడం విషాదాన్ని నింపింది. రేపో మాపో డిశ్చార్చ్ కానున్న అమ్మ ఆకస్మిక మృతితో అన్నాడీఎంకే కార్యకర్తలు,ఇతరులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement