సినీ నటి మనోరమ ఇక లేరు | Sakshi
Sakshi News home page

సినీ నటి మనోరమ ఇక లేరు

Published Sun, Oct 11 2015 12:52 AM

సినీ నటి మనోరమ ఇక లేరు

చెన్నై: ప్రముఖ సినీ నటి మనోరమ (78) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా గుండెపోటు రావడంతో శనివారం అర్థరాత్రి మనోరమ తుదిశ్వాస విడిచారు. 1958 లో మాలిట్టా మంగై అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన మనోరమ వెయ్యి సినిమాలకు పైగా నటించి గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించారు. (ఫోటో గ్యాలరీ  ...)

1980లో శుభోదయం సినిమాతో తెలుగు రంగంలోకి ప్రవేశించారు. తమిళం, తెలుగు, మళయాళం, హిందీ భాషల్లో మనోరమ నటించారు. 1955 లో ఫిలిం ఫేర్ లైఫ్ అఛీవ్మెంట్ అవార్డు సాధించారు. 2002లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ  పురస్కారంతో సత్కరించింది. 1937, మే 26న తమిళనాడులోని మన్నార్ గుడిలో మనోరమ జన్మించారు. మనోరమ అసలు పేరు గోపీశాంత. మనోరమకు ఒక కుమారుడు. ఆమె నటించిన చివరి చిత్రం సింగం-2.

మనోరమ నటించిన తెలుగు చిత్రాలు:
♦  శుభోదయం
  జెంటిల్మేన్
♦  రిక్షావోడు
♦  పంజరం
బావనచ్చాడు
♦  మనసున్నమారాజు
♦  అరుంధతి
♦  నీప్రేమకై
కృష్ణార్జున

Advertisement
Advertisement