రాంచరణ్‌ తండ్రి కాబోతున్నాడా?.. క్లారిటీ! | Sakshi
Sakshi News home page

రాంచరణ్‌ తండ్రి కాబోతున్నాడా?.. క్లారిటీ!

Published Tue, Mar 21 2017 6:28 PM

రాంచరణ్‌ తండ్రి కాబోతున్నాడా?.. క్లారిటీ!

మెగా హీరో రాంచరణ్‌ తండ్రి కాబోతున్నట్టు సోమవారం ఒక్కసారిగా ఊహాగానాలు గుప్పుమన్నాయి. అయితే, ఈ ఊహాగానాలపై తాజాగా రాంచరణ్‌ సన్నిహిత వర్గాలు స్పందించాయి. ఆయన తండ్రి కాబోతున్నట్టు వస్తున్న కథనాలు ఉట్టి వదంతులేనని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. రాంచరణ్‌ ప్రస్తుతం తన కెరీర్‌ మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించారని, ఇప్పటికిప్పుడు ఓ బిడ్డకు తండ్రి కావాలన్న ఆలోచన ఆయనకు లేదని అంటున్నాయి. రాంచరణ్‌ సతీమణి ఉపాసన గర్భవతి అయినట్టు వెబ్‌మీడియాలో సోమవారం కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.
 
అపోలో ఆస్పత్రి చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి మనవరాలు అయిన ఉపాసనను రాంచరణ్‌ 2012 జూన్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చరణ్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్రామీణ నేపథ్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన నిర్మాణంలో రూపొందిన ఖైదీ నంబర్‌ 150, ధ్రువ సినిమాలు విజయవంతంగా కావడంతో చరణ్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement