నింగికెగిసిన ప్రముఖ గాయని | Sakshi
Sakshi News home page

నింగికెగిసిన ప్రముఖ గాయని

Published Tue, Apr 4 2017 9:03 AM

నింగికెగిసిన ప్రముఖ గాయని - Sakshi

ముంబై: ప్రఖ్యాత శాస్త్రీయ గాయకురాలు   కిషోరి అమోంకర్‌ (84) ఇకలేరు.  సోమవారం అర్థరాత్రి ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ వర్గాలు మంగళవారం  ప్రకటించాయి.  శివాజీ పార్క్ స్మశానంలో  మంగళవారం సాయంత్రం అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు చెప్పారు.  దీంతో సంగతీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది.

10 ఏప్రిల్ 1932లో ముంబైలో జన్మించిన ఆమె  హిందుస్తానీ శాస్త్రీయ  సంప్రదాయంలో పేరు గాంచారు. ముఖ్యంగా మరియు జైపూర్ ఘరానా అనే వినూత్నమైన, విలక్షణమైన సంగీత శైలికి ఆమె ఆద్యురాలు. ఏడు దశాబ్దాలపాటు  సంగీత ప్రపంచానికి విశిష్ట  సేవలందించారు.  ప్రసిద్ధ గాయకులు బాలమురళీ కృష్ణ,  పండిట్‌ రవిశంకర్‌,  భీమ్ సేన్ జోషి  లాంటి నిష్ణాతులతో  కలిసి  అనేక  కచేరీలు   నిర్వహించారు.  విశిష్ట  ప్రతిభతో  సంగీత ప్రియులను ఆకట్టుకున్న  గాయక దిగ్గజం కిషోరి  గాన సరస్వతి  పద్మభూషణ్‌‌, సాహిత్య అకాడమీ లాంటి ఎన్నో పురస్కారాలను  అందుకున్నారు.  ఆమెకు ఇద్దరు కుమారులు,  మునిమనవలు ఉన్నారు.

కిషోరి ఆకస్మిక  మరణం పట్ల  పలువురు సుప్రసిద్ధ  సంగీతకారులు, గాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ గాయని  లతామంగేష్కర్‌ కిషోరి మరణం సంగీత ప్రపంచానికి తీరలోటని  పేర్కొన్నారు.  

 

Advertisement

తప్పక చదవండి

Advertisement