‘విమోచనం’.. ఉద్రిక్తం | Sakshi
Sakshi News home page

‘విమోచనం’.. ఉద్రిక్తం

Published Tue, Sep 15 2015 2:26 AM

‘విమోచనం’.. ఉద్రిక్తం

హన్మకొండ: తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెం బర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చే స్తూ బీజేపీ వరంగల్‌లో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి, జాతీయ జెండా ఎగురవేత ఉద్రిక్తంగా మారింది. తొలుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సారథ్యంలో హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద సమావేశం జరిగింది.  అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి, కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరారు. పోలీసు వలయాన్ని చేధించుకొని బీజేపీ కార్యకర్తలు కలెక్టరేట్ వైపునకు పరుగులు తీశారు.  కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు.  కిషన్‌రెడ్డి,  ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి  పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా కార్యక్తలు అడ్డగించారు.

పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం నెలకొంది.  అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై నాయకులను వదిలేశారు. కాగా, నైజాం పాలన నుంచి విమోచనం పొందిన సెప్టెం బర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి  తెలంగాణ జేఏసీ మరో ఉద్యమం చేయాల్సిన అవసరముందని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.

Advertisement
Advertisement