సామాన్యుడు సైతం పార్లమెంట్ కు వెళ్లాలి:కేజ్రీవాల్ | Sakshi
Sakshi News home page

సామాన్యుడు సైతం పార్లమెంట్ కు వెళ్లాలి:కేజ్రీవాల్

Published Fri, Jan 31 2014 4:34 PM

సామాన్యుడు సైతం పార్లమెంట్ కు వెళ్లాలి:కేజ్రీవాల్ - Sakshi

ఢిల్లీ: ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలపై ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. గత 65 ఏళ్లుగా ఆ పార్టీల నుంచి  తమకు మంచి జరుగుతుందని ఎదురు చూస్తున్న ప్రజలకు భంగపాటు తప్పడం లేదన్నారు.ఈ క్రమంలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 350 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.  నేర రాజకీయాలకు, అవినీతికి చిహ్నాలుగా మారిన కళంకిత అభ్యర్థులను చట్టసభకు రాకుండా చేసేందుకు వారిపై తమ అభ్యర్థులను కచ్చితంగా బరిలోకి దింపుతామన్నారు. సామాన్య ప్రజా సమస్యలనే లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యం..సామాన్య ప్రజల్ని కూడా పార్లమెంట్ పంపేడమేనన్నారు.

 

అప్పుడే సామాన్యుడు తన హక్కుల గురించి మాట్లాడటానికి పరిష్కారం దొరకుంతుదని కేజ్రీవాల్ తెలిపారు. లోక్ పాల్ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించడంతోనే అవినీతి పై పోరు ముగిసిపోయినట్లు కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అవినీతి  అంతమొందించాలంటే నిర్వీరామంగా పోరాటం చేయకతప్పదన్నారు. దేశంలోని కొంతమంది ప్రముఖలపై ఆమ్ ఆద్మీ పార్టీ పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. కేంద్రమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, డీఎంకే ఎంపీలు అళిగిరి, మాజీ మంత్రి రాజా, కనిమొళి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు గడ్కారీ, బీజేపీ జాతీయ కార్యదర్శి అనంత్ కుమార్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప తదితరులపై తమ అభ్యర్థులను బరిలో దింపుతామన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement