ప్రియాంకా... కాంగ్రెస్ ను కాపాడండి | Sakshi
Sakshi News home page

ప్రియాంకా... కాంగ్రెస్ ను కాపాడండి

Published Sun, Oct 19 2014 1:03 PM

ప్రియాంకా... కాంగ్రెస్ ను కాపాడండి - Sakshi

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఫలితాల సరళి వెల్లడిచేయడంతో పార్టీ కార్యకర్తల్లో ఆందోళన మొదలయింది. ఇక పార్టీకి ప్రియాంక గాంధీయే శరణ్యమని వారు భావిస్తున్నారు. ఆమె పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందేనని నినదిస్తున్నారు.

ఏఐసీసీ కార్యాలయం వద్ద ఆదివారం పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పోగయ్యారు. ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలంటూ ఆందోళనకు దిగారు. ప్రియాంక లావో కాంగ్రెస్ బచావో(ప్రియాంకను తీసుకురండి; కాంగ్రెస్ ను కాపాడండి) అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే ప్రియాంక గాంధీని రాజకీయాల్లోకి రావాలని కోరడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పుడే తనకు క్రియాశీల రాజకీయాల్లోకి  వచ్చే ఉద్దేశం లేదని ఇంతకుముందు ప్రియాంక స్పష్టం చేశారు.

Advertisement
Advertisement