నా బర్త్ డే.. పిస్టల్తో కాలిస్తే తప్పేంటి? | Sakshi
Sakshi News home page

నా బర్త్ డే.. పిస్టల్తో కాలిస్తే తప్పేంటి?

Published Fri, Aug 12 2016 3:33 PM

నా బర్త్ డే.. పిస్టల్తో కాలిస్తే తప్పేంటి? - Sakshi

చండీగఢ్లో బల్వన్ సింగ్ (55) అనే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మద్యంమత్తులో రెచ్చిపోయాడు. ఫుల్గా మందుకొట్టి తన సర్వీస్ పిస్టల్తో మూడు సార్లు గాల్లోకి కాల్చాడు. ఇదేమి నిర్వాకమని ప్రశ్నించిన పోలీసులకు ఇతను చెప్పిన కారణం తన బర్త్ డే అట. 'ఈ రోజు నా బర్త్ డే, కాలిస్తే తప్పేంటి?'  అని బల్వన్ సింగ్ ఎదురు ప్రశ్న వేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు.

చండీగఢ్ సెక్టార్ 46లో రెహ్రీ మార్కెట్లో బల్వన్ సింగ్ దుందుడుకు చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన ఓం ప్రకాష్ అనే డాబా ఓనర్ పోలీసులకు సమాచారం అందించాడు. బల్వన్ చర్య వల్ల మార్కెట్లో భయానక పరిస్థితి ఏర్పడిందని ఫిర్యాదు చేశాడు. పోలీసులు బల్వన్ పిస్టల్ను స్వాధీనం చేసుకుని, ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగాడా లేదా అని నిర్ధారించేందుకు ఆయన రక్తం నమూనాను సేకరించి పరీక్షకు పపారు. డిపార్ట్మెంట్ విచారణను ఎదుర్కోనున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement