దళితులతో ఇంట్లో పూజ చేయించిన సీఎం!

8 Sep, 2016 18:58 IST|Sakshi
దళితులతో ఇంట్లో పూజ చేయించిన సీఎం!

ముంబై: ఓ దళిత జంటతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన నివాసంలో గణపతి పూజ చేయించారు. బుధవారం కొంకణ్ తీరంలో ఉన్న మహాదేవాచే కెర్వాడే గ్రామంలో పండుగ సందర్భంగా గ్రామానికి చెందిన పరమానంద్ హీవాలేకర్, ప్రీతమ్ దంపతులు పూజ కోసం ఆలయానికి వెళ్లారు. దళిత కులానికి చెందిన వారు ఆలయంలోకి ప్రవేశించకూడదంటూ జాట్ పంచాయతీ పెద్దలు, గ్రామస్థులు
వారిపై ఆంక్షలు విధించారు. దీంతో వారు ఆలయం వద్దే నిరసనకు దిగారు.

ఈ ఘటనపై స్పందించిన సీఎం ఫడ్నవీస్ వారిని వార్షాలోని తన నివాసానికి రావాలంటూ ఆహ్వానం పంపారు. అక్కడే ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి వారితో పూజ చేయించారు. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో కులం పేరుతో దారుణాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు