ప్రారంభమైన ‘క్రెడాయ్ కాన్‌క్లేవ్-2013’ | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ‘క్రెడాయ్ కాన్‌క్లేవ్-2013’

Published Sat, Dec 14 2013 6:45 AM

CREDAI conclave opens in Delhi

సాక్షి, హైదరాబాద్: భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) కాన్‌క్లేవ్-2013 శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుందని క్రెడాయ్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
 
 భారత స్థిరాస్తి రంగ ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి , ఈ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల జరిగే అభివృద్ధిని వివరించడానికి ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మెకిన్సే నివేదిక ప్రకారం ప్రస్తుతం మన దేశంలో 1.87 కోట్ల ఇళ్ల కొరత ఉందని, 2030 నాటికి పట్టణ జనాభా 59 కోట్లకు చేరుకుంటుందని అప్పుడు మరింత ఇళ్ల అవసరం ఉంటుందని చెప్పారు. ఈ స్థాయిలో ఇళ్ల కొరత తీర్చాలంటే సుమారు 1.2 ట్రిలియన్ డాలర్ల నిధులు  అవసరమన్నారు. మరి ఈ స్థాయిలో పెట్టుబడులు పెరగాలంటే స్థిరాస్తి రంగాన్ని కేంద్రం ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో స్థిరాస్తి ప్రాజెక్టులకు ఎన్‌ఓసీ సర్టిఫికేట్ తీసుకోవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతోందని దీంతో ఒక్కో భవనం మీద సుమారు 40 శాతం భారం పడుతోందన్నారు. ఈ భారాన్ని తగ్గించేందుకు సింగిల్ విండో సిస్టం, ఆన్‌లైన్‌లో అనుమతుల మంజూరు విధానాలను అమలులోకి తీసుకురావాలని సూచించారు. దీంతో ధరలు 10 నుంచి 25 శాతానికి తగ్గే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement